Sircilla: సిరిసిల్ల మగ్గంపై బంగారు చీర..
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:36 AM
సిరిసిల్ల చేనేత మగ్గంపై మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ బంగారంతో చీరను నేసి అబ్బురపరిచాడు.
తయారు చేసిన సిరిసిల్ల నేత కళాకారుడు విజయ్
200 గ్రాముల బంగారం వినియోగం..18 లక్షల ఖర్చు
సిరిసిల్ల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల చేనేత మగ్గంపై మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ బంగారంతో చీరను నేసి అబ్బురపరిచాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు వివాహం అక్టోబరు 17న ఉంది. తన కూతురు వివాహంలో ఓ ప్రత్యేక ఉండాలని భావించిన సదరు వ్యాపారవేత్త విజయ్‌తో బంగారు చీరను తయారు చేయించాలనుకున్నారు.
200 గ్రాముల పసిడిని వినియోగించి రూ.18 లక్షల వ్యయంతో చీరను నేయించారు. ఆరు నెలల క్రితమే చీరకు ఆర్డరు తీసుకున్న విజయ్.. బంగారాన్ని జరీ పోగులుగా తయారు చేయించారు. అనంతరం మగ్గంపై చీరను నేశారు. 12 రోజుల్లో నేసిన ఈ చీర 49 అంగుళాల వెడల్పు, 5.50 మీటర్ల పొడవు, 800 గ్రాముల బరువు ఉంది. విజయ్ పదేళ్లుగా చేనేత, మరమగ్గాలపై వినూత్న ప్రయోగాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
Updated Date - Sep 29 , 2024 | 04:36 AM