ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Software Industry: జీతాలివ్వడం లేదనే ఆగ్రహంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో కిడ్నాప్‌

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:51 AM

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో సంస్థ ఉద్యోగుల్లో కొందరు తాము పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈవోనే కిడ్నాప్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగింది.

బంజారాహిల్స్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో సంస్థ ఉద్యోగుల్లో కొందరు తాము పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈవోనే కిడ్నాప్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగింది. అపహరణకు గురైంది ఇన్‌ ఆర్బిట్‌ మాల్‌ ఎదురుగా ఉన్న టీ హబ్‌లో గిగ్‌లియాస్‌ సంస్థ సీఈవో రవిచంద్రారెడ్డి. ఆయన జూబ్లీహల్స్‌లోని హుడా కాలనీలో నివస్తున్నారు. ఈ నెల 10న రాత్రి ఇంట్లో స్నేహితుడు మోహన్‌, తల్లి మాధవితో కలిసి రవిచంద్రారెడ్డి డిన్నర్‌ చేస్తుండగా ఆయన ఇంటిముందు ఓ కారు ఆగింది. అందులోంచి దిగిన కొందరు నేరుగా ఇంట్లోకి ప్రవేశించారు. రవిచంద్రారెడ్డి, మోహన్‌ను బలవంతంగా తమతో తీసుకుపోయారు. రవిచంద్రారెడ్డి కారును కూడా తీసుకువెళ్లారు.


మాధవిని ఇంట్లోనే నిర్బంధించారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటపడ్డ మాధవి, ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ ఫుటేజీ ద్వారా నిందితుల కార్లు బెంగళూరు హైవే మీదుగా వెళ్లినట్లు గుర్తించారు. రవిచంద్రారెడ్డి, మోహన్‌లను నాగర్‌కర్నూల్‌లోని ఓ హోటల్‌లో బంధించినట్లు తెలియడంతో పోలీసులు అక్కడకు వెళ్లి ఇద్దరినీ సురక్షితంగా రక్షించారు. రవిచంద్రారెడ్డిని అపహరించింది ఆయన సంస్థల్లో పనిచేస్తున్న 8మంది ఉద్యోగులని గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. రవిచంద్రారెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇస్తానని 1500 మందిని నియమించుకున్నారని, అందరికీ శిక్షణ ఇచ్చి మూడు నెలలుగా ఉద్యోగం చేయించుకున్నారని, జీతాలు ఇవ్వలేదని నిందితులు ఆరోపించినట్లు తెలిసింది.

Updated Date - Jul 13 , 2024 | 04:51 AM

Advertising
Advertising
<