Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

ABN, Publish Date - Aug 22 , 2024 | 03:34 AM

సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం రాత్రి తెలిపారు.

Gaddam Prasad Kumar: రుణమాఫీ సొమ్ము వాపస్‌ చేసిన స్పీకర్‌

  • తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి 1.5 లక్షలు

తాండూరు, ఆగస్టు 21: సాంకేతిక కారణాలతో తన ఖాతాలో పొరపాటున జమ అయిన రైతు రుణమాఫీ నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయడం జరిగిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం రాత్రి తెలిపారు. ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ తాను ఐటీ పరిధిలోకి వస్తానని, రుణమాఫీ పొందడానికి అనర్హుడినని చెప్పారు.


ఈ మేరకు కలెక్టర్‌కు స్వయంగా లేఖ రాసి తన ఖాతాలో జమ అయిన రూ.1,50,863ను ఎల్మకన్నె సహకారబ్యాంకు ద్వారా తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయడమైందని స్పీకర్‌ వివరించారు.

Updated Date - Aug 22 , 2024 | 03:34 AM

Advertising
Advertising
<