Special buses: రాఖీ పౌర్ణమి సందర్భంగా.. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ABN, Publish Date - Aug 16 , 2024 | 11:50 AM
రాఖీ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం(Arunachalam)లో గిరి ప్రదక్షిణ చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో(Hyderabad-2 Depot) ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు.
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం(Arunachalam)లో గిరి ప్రదక్షిణ చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ హైదరాబాద్-2 డిపో(Hyderabad-2 Depot) ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. ఈనెల 17న రాత్రి 7:15గంటలకు దిల్‌సుఖ్‌నగర్ నుంచి బయల్దేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్(Kanipakam, Golden Temple) మీదుగా అరుణాచలం చేరుకుంటుందన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మాయమాటలతో బాలికను అపహరించి అత్యాచారం..
19న మధ్యాహ్నం తిరిగి బయల్దేరి 20వ తేదీన హైదరాబాద్(Hyderabad) చేరుకుంటుందని ఆయన వివరించారు. ఒక్కరికి టికెట్ చార్జీగా రూ.3,600 చెల్లించాలి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నం. 9959226249, 9346559649, 9666350995లో సంప్రదించాలని పేర్కొన్నారు.
..............................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................
Hyderabad: 4 నెలల్లో రూ.6,894 కోట్ల ఆదాయం
- 523 కి.మీ. ‘కవచ్’ విస్తరణకు టెండర్లు పిలిచాం
- దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
- స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
హైదరాబాద్ సిటీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తోందని, గత నాలుగు (ఏప్రిల్-జూలై) నెలల్లో రూ.6,984 కోట్ల ఆదాయాన్ని సాధించిందని జీఎం అరుణ్‌కుమార్ జైన్(GM Arun Kumar Jain) తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 3 శాతం మెరుగైందన్నారు.
ఏప్రిల్ నుంచి జూలై వరకు జోన్ పరిధిలో 46.25 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదు చేశామని, సరుకు రవాణా విభాగంలో రూ.4,611 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని చెప్పారు. 8.8 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రూ. 1,956 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామన్నారు. ’కవచ్’ విస్తరణలో భాగంగా, వాడి- గుంతకల్- రేణిగుంట(Wadi- Guntakal- Renigunta) మధ్య 523 కి.మీ. మేర పనులకు టెండర్లు పిలిచామని జైన్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, గుర్తించిన 119 స్టేషన్లలో రూ.6,243 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 16 , 2024 | 11:50 AM