Special trains: దీపావళి, ఛత్ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Oct 23 , 2024 | 07:39 AM
దీపావళి, ఛత్ పండుగల(Diwali and Chhat festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చేందు ప్రయాణికుల సౌకర్యార్థం 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: దీపావళి, ఛత్ పండుగల(Diwali and Chhat festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చేందు ప్రయాణికుల సౌకర్యార్థం 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి, ఛత్ పండుగలకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్(West Bengal, Odisha, Jharkhand, Bihar)తో పాటు ఉత్తరప్రదేశ్, హరి యాణా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంటుందని రైల్వే అధికారులు వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: మనీలాండరింగ్ కేసు పేరుతో మహిళను బెదిరించి 43లక్షల దోపిడీ!
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రధాన రైల్వే స్టేషన్‌లు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ(Secunderabad, Hyderabad, Kachiguda) తదితర కేంద్రాల నుంచి షాలిమార్, రక్సాల్, జైపూర్, లాల్‌ఘర్, హిసార్, గోరక్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చి తదితర ప్రాంతాలకు అత్యధికంగా రైళ్లను నడుపుతున్నట్టు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లోని స్టేషన్లకు సైతం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. మధురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్(Madurai, Erode, Nagercoil, Kollam, Bangalore, Panvel, Dadar) తదితర ప్రాంతాలకు ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు వివరించారు.
విజయదశమి సందర్భంగా అక్టోబర్‌లో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలిపారు. గత ఏడాది దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో 626 ప్రత్యేక రైళ్లను నడుపగా ఈ ఏడాది మరింత డిమాండ్ పెరగడంతో 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నవంబర్ 30వరకు దాదాపు 6,556 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ఆయన తెలిపారు.
ఆన్‌రిజర్వ్డ్ కోచ్‌ల్లో ప్రయాణించాలనుకునేవారు జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టికెట్లను యూ.టి.ఎస్. మొబైల్‌యాప్ ద్వారా కొనుగోలుచేసుకొనే అవకాశం కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!
ఇదికూడా చదవండి: KTR : రేవంత్ చెప్పేవి పచ్చి అబద్ధాలు!
ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్ 1912
ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రాణహని!
Read Latest Telangana News and National News
Updated Date - Oct 23 , 2024 | 07:39 AM