ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జూలై నుంచే రుణమాఫీ!

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:07 AM

రుణమాఫీ ప్రక్రియను జూలై నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. జూలై 17న తొలి ఏకాదశి పర్వదినం ఉంది.

  • ముందే వెల్లడించిన ‘ఆంధ్రజ్యోతి’ జూలై నుంచే రుణమాఫీ!

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ ప్రక్రియను జూలై నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. జూలై 17న తొలి ఏకాదశి పర్వదినం ఉంది. ఆ లోపే రుణమాఫీ పక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. తక్కువ బకాయిలు ఉన్న రైతులతో ప్రారంభించి.. క్రమంగా పెంచుతూ రుణమాఫీ చేస్తారు. అయితే గత ప్రభుత్వం విడతలవారీగా రుణమాఫీ చేసింది. కానీ, ఐదేళ్లలో కూడా మాఫీ కొలిక్కిరాలేదు.


అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం విడతలవారీ ప్రక్రియకు స్వస్తి పలికి.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు రుణమాఫీకి కట్‌-ఆఫ్‌-డేట్‌గా తీసుకుంటోందని సీఎం చెప్పారు. ఈ విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది.

Updated Date - Jun 22 , 2024 | 03:07 AM

Advertising
Advertising