ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఫార్మాసిటీ భూముల్లో లైఫ్‌ సైన్సెస్‌ పార్క్‌

ABN, Publish Date - Sep 07 , 2024 | 03:46 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 12 వేల ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు భూముల్లో లైఫ్‌ సైన్సెస్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 12 వేల ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు భూముల్లో లైఫ్‌ సైన్సెస్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఫార్మాసిటీ ప్రాజెక్టు ఇప్పటికీ కొనసాగుతోందా? రద్దయిందా? స్పష్టంగా చెప్పాలని ఈనెల 3న హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ సమాచారం ఇచ్చింది.


ఫార్మాసిటీ భూసేకరణను గతేడాది హైకోర్టు కొట్టేసినప్పటికీ తమ భూములపై ఇప్పటికీ ప్రభుత్వం ఆంక్షలు కొనసాగిస్తోందని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన ఆరేపల్లి జంగయ్య సహా 49 మంది రైతులు, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. శుక్రవారం మరోసారి విచారణ జరిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫార్మా సిటీ భూముల్లో లైఫ్‌సైన్సెస్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. దాంతో ఇదే విషయాన్ని పేర్కొంటూ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి 20లోగా అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Updated Date - Sep 07 , 2024 | 03:46 AM

Advertising
Advertising