ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుళ్లిన కూరగాయలు.. అన్నంలో పురుగులు

ABN, Publish Date - Nov 25 , 2024 | 04:06 AM

మధ్యాహ్న భోజనం విషతుల్యమై విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు.

  • విద్యార్థుల గదుల పక్కనే కుక్కల సంచారం

  • గదుల్లో దుర్వాసన, కంపు కొడుతున్న బాత్‌రూములు

  • గిర్మాపూర్‌ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

కొండాపూర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనం విషతుల్యమై విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో భోజనం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల గదుల్లో దుర్వాసన, బాత్‌రూమ్‌లు కంపుకొడుతున్నాయని ఆదివారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యంలో పురుగులు, కుళ్లిన కూరగాయలతో తమ పిల్లలకు భోజనం పెడుతున్నారని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.


విద్యార్థుల గదులకు పక్కనే కుక్కలు సంచరిస్తున్నాయని, కంపు, దుర్భర పరిస్థితుల్లో మా పిల్లలను చూడడం బాధగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గదులను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోందని విద్యార్థులు వాపోయారు. గదులను శుభ్రం చేయించడం, ఫ్యాన్లకు మరమ్మతులు వంటివి తమతో చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ సుదర్శన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. విద్యార్థులకు మెనూ ప్రకారమే వడ్డించాలని సిబ్బందికి సూచించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు.

Updated Date - Nov 25 , 2024 | 04:06 AM