ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: అంతుపట్టని వ్యాధితో అవస్థలు..

ABN, Publish Date - May 28 , 2024 | 04:43 AM

అంతుపట్టని వ్యాధితో బాధపడుతూ.. తినడానికి తిండి లేక కన్న కూతురు కోసం భిక్షాటన చేస్తూ, మందులు కొనుక్కోలేని స్థితిలో చావే శరణ్యమంటోంది కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహలో నివాసముంటున్న ఓ అభాగ్యురాలు.

  • మందులకూ డబ్బుల్లేని వైనం

  • సీఎం సారు ఆదుకోవాలని వినతి

జీడిమెట్ల, మే 27 (ఆంధ్రజ్యోతి): అంతుపట్టని వ్యాధితో బాధపడుతూ.. తినడానికి తిండి లేక కన్న కూతురు కోసం భిక్షాటన చేస్తూ, మందులు కొనుక్కోలేని స్థితిలో చావే శరణ్యమంటోంది కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహలో నివాసముంటున్న ఓ అభాగ్యురాలు. ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని క వేడుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన చెల్లుబోయిన నవీన్‌, రాధిక(34) భార్యాభర్తలు. వీరికి సాయి అక్షయ అనే ఐదేళ్ల కుమార్తె ఉంది. వీరు దాదాపు 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి రాజీవ్‌ గృహకల్పలోని బ్లాక్‌నెంబర్‌ 22, ప్లాట్‌నెంబర్‌ 4లో అద్దెకు ఉంటున్నారు.


కొన్నాళ్ల క్రితం భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. 2012లో రాధిక కింద పడటంతో కాలు విరిగిపోయింది. ఐరన్‌ రాడ్డు వేయడానికి వీలు కాకపోవడంతో జీడిమెట్ల నారాయణ హృదయాలయం వైద్యులు సన్నటి వైరు ద్వారా చికిత్స చేశారు. కొంత కాలం తర్వాత అంతుపట్టని వ్యాధితో కాలు పూర్తిగా పాడైపోయింది. తర్వాత రెండు కాళ్లకు ఆ వ్యాధి సోకడంతో నడవలేని స్థితిలో బిడ్డను పోషించుకోవడానికి భిక్షాటన చేస్తోంది. ‘మందులకు డబ్బులు లేక, అద్దె కట్టలేక సతమతమవుతున్నా. కన్న కూతురు కోసం బతుకుతున్నా. సీఎం సహాయం చేసి నన్ను, నా కుమార్తెను ఆదుకోండి... లేదంటే చావే శరణ్యం.’’ అని వేడుకుంటోంది. ఒక్కసారి సీఎం రేవంత్‌ను చూడాలని ఉంది అని రాధిక ‘ఆంధ్రజ్యోతి’తో తన గోడు వెళ్లబోసుకుంది.

Updated Date - May 28 , 2024 | 04:43 AM

Advertising
Advertising