ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం తిరస్కృతి!

ABN, Publish Date - Sep 21 , 2024 | 03:34 AM

ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా కేవలం ఊహా జనితమైన అంశాలతో పిటిషన్‌ వే శారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

  • ఊహాజనితఅంశాలతో పిటిషన్‌ వేశారని వ్యాఖ్య

  • కేసు దర్యాప్తులో జోక్యం ఉండొద్దని రేవంత్‌కు ఆదేశం

  • ప్రాసిక్యూషన్‌కు సహకరించాలని ఏసీబీకి నిర్దేశం

  • రేవంత్‌ క్షమాపణలను అంగీకరించిన ధర్మాసనం

  • రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా కేవలం ఊహా జనితమైన అంశాలతో పిటిషన్‌ వే శారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో పిటిషనర్లు ప్రాసిక్యూషన్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినందున ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రా యపడింది. అలాగే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్‌ నేతలు జగదీశ్‌రెడ్డి, మహమ్మద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, కల్వకుంట్ల సంజయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.


తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్దార్థ్‌ లూథ్ర, మేనకా గురుస్వామి, పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు ఆర్యమా సుందరం, దామా శేషాద్రి నాయుడు, న్యా యవాది మోహిత్‌ రావు హాజరయ్యారు. తొలుత ఆర్య మ సుందరం వాదనలు వినిపిస్తూ.. ఓటుకు నోటు కేసును విచారిస్తున్న ఏసీబీ రాష్ట్ర హోంశాఖ పరిధిలో ఉన్నదని, ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా కేసులో నిం దితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. ఏసీబీ, ప్రాసిక్యూషన్‌, అలాగే అధికారులు ఆయనకే రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏసీబీ ఎవరి ని విచారించాలి? ఎవరిని విచారించవద్దు? అనేది హోం మంత్రిత్వ శాఖే నిర్ణయిస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్వతంత్ర వ్యవస్థ నుంచి ప్రాసిక్యూషన్‌కు స్పష్టమైన ఆదేశాలు ఉండాలని కోరారు. అందుకే.. సుప్రీం విశ్రాం త న్యాయమూర్తికి ప్రాసిక్యూషన్‌ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.


  • అన్ని శాఖలు సీఎం పరిధిలోనే

పిటిషనర్ల తరఫున వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. మీరు చెప్పినట్లు కేసు విచారణను మరోచోటుకు మార్చినప్పటికీ అధికారులు హోం మంత్రికి చెప్పిన తర్వాతే కోర్టుకు వెళతారు కదా? అని ప్రశ్నించింది. హోంశాఖ ఆయన పరిధిలో లేకపోయినా ఒక ముఖ్యమంత్రిగా అన్ని శాఖలు ఆయన పర్యవేక్షణలో పని చేయాల్సిందే కదా? అని ధర్మాసనం పేర్కొంది. అందుకే ప్రాసిక్యూషన్‌ అనేది స్వతంత్రంగా జరగాల ని తాము కోరుతున్నామని ఆర్యమ సుందరం తెలిపారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం లో విచారణ కొనసాగినప్పుడే దర్యాప్తు నిజాయితీగా జరుగుతుందన్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, అధికారులను విచారించాల్సి ఉన్నదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సుందరం వాదనలకు ముకుల్‌ రోహిత్గీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే చాలామంది విచారణ పూర్తయిందని తెలిపారు. రాజకీయ కోణంలోనే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారన్నారు. గతంలో ఈ కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారిని కొనసాగించడం మీకు సమ్మతమేనా? అని పిటిషన్ల తరఫు న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. వారి నుంచి ఎటువంటి అభ్యంతరం రాలేదు. అలాంటప్పుడు గతంలో ఇదే ప్రాసిక్యూషన్‌పై అనుమానం ఎందుకు వ్యక్తం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లు ప్రాసిక్యూషన్‌పై పూర్తి నమ్మకం వ్యక్తం చేసినందుకు ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.


  • రేవంత్‌కు రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు

కేసు విచారణలో ఎటువంటి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని రేవంత్‌రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక నుంచి కేసు విచారణను సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించవద్దని ఏసీబీ డీజీని ఆదేశించింది. ప్రత్యేక ప్రాసిక్యూషన్‌కు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పింది. ప్రతివాది అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ కేసు విచారణలో జోక్యం చేసుకుంటే మళ్లీ కోర్టు ను ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సందర్భంలో ట్రయల్‌ కోర్టు కేసు విచారణను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించింది.


  • రేవంత్‌.. క్షమాపణలు స్వీకరిస్తున్నాం

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం కేసు విచారణ సందర్భంగా మరోసారి ఆ అంశం ప్రస్తావన వచ్చిం ది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆర్యమ సుందరం ప్రస్తావించగా, రేవంత్‌రెడ్డి స్థానంలో మరొకరిని నియమించారని రోహత్గీ గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ఒకసారి సోషల్‌ మీడియా వేదికగా, మరోసారి బహిరంగంగా రెండుసార్లు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మరోసారి హితవు పలికింది. ‘‘ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు సరికాదు. క్షమాపణలను స్వీకరిస్తున్నప్పటికీ కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేేసటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని మరోసారి సూచిస్తున్నాం‘‘ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Updated Date - Sep 21 , 2024 | 03:34 AM