ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NSTP: ఈ-సమన్లు.. ఈ-వారెంట్లు!

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:06 AM

నేర న్యాయ వ్యవస్థలో ‘నేషనల్‌ సర్వీస్‌ అండ్‌ ట్రాకింగ్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్‌ ప్రాసెసెస్‌ (ఎన్‌స్టె్‌ప)’ అమలుతో పారదర్శకత మరింత పెరుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు.

  • నేర న్యాయ ప్రక్రియలో ‘ఎన్‌స్టె్‌ప’ ఆన్‌లైన్‌ వ్యవస్థ

  • తెలంగాణలో ప్రారంభించిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ గవాయ్‌

  • నిందితులు/కోర్టు కానిస్టేబుళ్లకు నేరుగా సమన్లు

  • నేర న్యాయ ప్రక్రియ సులభతరం, పారదర్శకమని వ్యాఖ్య

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నేర న్యాయ వ్యవస్థలో ‘నేషనల్‌ సర్వీస్‌ అండ్‌ ట్రాకింగ్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్‌ ప్రాసెసెస్‌ (ఎన్‌స్టె్‌ప)’ అమలుతో పారదర్శకత మరింత పెరుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. ఎన్‌స్టె్‌పతో నేర న్యాయ వ్యవస్థ మరింత సామర్థ్యం, పారదర్శకతతో పనిచేస్తుందని చెప్పారు. సివిల్‌ విభాగంలో ఎన్‌స్టె్‌ప అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ.. ఇప్పుడు క్రిమినల్‌ కేసుల విభాగంలో ఈ వ్యవస్థను అమలు చేసిన మూడో రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. శనివారం సికింద్రాబాద్‌లోని జ్యుడీషియల్‌ అకాడమీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, డీజీపీ జితేందర్‌తో కలిసి జస్టిస్‌ గవాయ్‌ ‘ఎన్‌స్టె్‌ప’ను ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా నేర న్యాయ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు. ఎన్‌స్టె్‌ప ద్వారా నిందితులకు/కోర్టు కానిస్టేబుళ్లకు నేరుగా సమన్లు, వారెంట్లు అందుతాయని తెలిపారు. ‘మనందరి ఉమ్మడి కృషితో తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో ఎన్‌స్టె్‌పను ప్రారంభించుకుంటున్నాం.


దీనివల్ల జ్యుడీషియల్‌ ప్రక్రియలో మరింత సామర్థ్యం, పారదర్శకత పెరుగుతుంది. నేరన్యాయ వ్యవస్థలో విపరీతమైన ఆలస్యం వల్ల నిందితులు అనవసరంగా జైళ్లలో మగ్గాల్సి వస్తుంది. ఇది వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. పీఎంఎల్‌ఏ చట్టం కింద అయినా సరే నిందితులను సుదీర్ఘంగా ఎలాంటి విచారణ లేకుండా జైల్లో ఉంచడం చెల్లదని, ఆర్టికల్‌ 21 కింద పౌరులకు ఉన్న హక్కులే అత్యున్నతమని ఇటీవలే నేను తీర్పు ఇచ్చా. న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తే అన్యాయం చేసినట్లేనని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన విచారణతోపాటు తగిన సమయానికి న్యాయం చేయ డం కూడా ముఖ్యమే. ఎలకా్ట్రనిక్‌ పద్ధతిలో మొబైల్‌ యాప్‌, కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌ ద్వారా పనిచేసే ఎన్‌స్టెప్‌ వల్ల రియల్‌ టైంలో సమన్లు అందజేయవచ్చు. న్యాయవ్యవస్థను టెక్నాలజీతో అనుసంధానం చేయడం, డిజిటల్‌ సొల్యూషన్స్‌, డిజిటలైజేషన్‌ చేయాలన్న సుప్రీంకోర్టు లక్ష్యాల్లో భాగంగా ఈ ఆన్‌లైన్‌ వ్యవస్థ రూపుదిద్దుకుంది’ అని చెప్పారు.


  • తెలంగాణ హైకోర్టులో అత్యధిక మహిళా జడ్జిలు..

తెలంగాణ హైకోర్టులో అత్యధిక మహిళా జడ్జిల ప్రాతినిఽధ్యం ఉండడం అభినందనీయమని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ చట్టం చేయకముందే తెలంగాణ హైకోర్టు 33 శాతం మహిళా ప్రాతినిధ్యం అనే లక్ష్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన జ్యుడీషియల్‌ అధికారుల్లోనూ అత్యధికంగా మహిళలే కనిపిస్తున్నారన్నారు. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే మాట్లాడుతూ.. సివిల్‌ విభాగంలో ఎన్‌స్టె్‌ప ప్రారంభించిన తొలి రాష్ట్రంగా.. క్రిమినల్‌ విభాగంలో మూడో రాష్ట్రంగా నిలవడం గర్వకారణమని తెలిపారు.


  • ఇందిరమ్మ కమిటీల జీవో సబబే: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడంలో భాగంగా గ్రామపంచాయతీ, మునిసిపల్‌ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33 చట్టవిరుద్ధం కాదని హైకోర్టు పేర్కొంది. అక్టోబరు 11న ఆర్‌అండ్‌బీ శాఖ జారీ చేసిన ఇందిరమ్మ కమిటీల జీవోను కొట్టేయాలంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ భీమపాక నగేశ్‌ ధర్మాసనం కొట్టేసింది. సంక్షేమ పథకాలను అమలు చేయడమనేది ప్రభుత్వ విచక్షణ అని.. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అయితే పథకం ఉద్దేశానికి భిన్నంగా అమలు చేస్తున్నట్లయితే పిటిషనర్లు మళ్లీ కోర్టుకు రావచ్చని తెలిపింది.

Updated Date - Nov 24 , 2024 | 04:06 AM