ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Outsourcing Employee: సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..అసలేమైంది

ABN, Publish Date - May 10 , 2024 | 01:38 PM

తెలంగాణ(Telangana) సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మరణం నేపథ్యంలో మిగతా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారిని కలిసి న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు కోరారు. అయితే అసలు రాహుల్ ఎలా మృతి చెందాడు. ఏంటి విషయం అనేది ఇప్పుడు చుద్దాం.

telangana Secretariat Outsourcing employee Rahul death

తెలంగాణ(Telangana) సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి(Outsourcing Employee) రాహుల్ అనుమానాస్పద మరణం నేపథ్యంలో మిగతా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎస్ శాంతి కుమారిని కలిసి న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎస్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అసలు రాహుల్ ఎలా మృతి చెందాడు. ఏంటి విషయం అనేది ఇప్పుడు చుద్దాం.


మే 7, 2024 ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిని పేషీలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్(rahul) మధ్యాహ్నం 12 గంటలకు అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ క్రమంలోనే డబ్బులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో రాహుల్‌ని నిమ్స్(nims) ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.


దీంతో రాహుల్‌(33)కు గుండె శస్త్ర చికిత్స ఆపరేషన్‌తోపాటు డయాలసిస్ చేయగా ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత నిన్న రాత్రి 9 గంటలకు మరణించారు. ఈ నేపథ్యంలో రాణి కుమిదిని రాహుల్‌ను సీరియస్ గా మందలించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయన మృతి నేపథ్యంలో అతని కుటుంబానికి న్యాయం చేయాలని తోటి సిబ్బంది సీఎస్‌ను కోరారు. హైదరాబాద్(hyderabad) పురాణ పుల్‌కు చెందిన రాహుల్ గత 11 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.


ఇది కూడా చదవండి:

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 01:45 PM

Advertising
Advertising