Nalgonda: కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్
ABN, Publish Date - Dec 02 , 2024 | 04:59 AM
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవల్సిన టీచర్లు గాడి తప్పుతున్నారు.
ప్రిన్సిపాల్‌కూ నోటీసులు.. నల్లగొండ జిల్లాలో ఘటన
నిడమనూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవల్సిన టీచర్లు గాడి తప్పుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు దొడ్డా అంజనేయులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 6, 7, 8 తరగతుల బాలికలు వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రిన్సిపాల్ బూరుగు నిర్మలకు సైతం నోటీసులు జారీ చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - Dec 02 , 2024 | 04:59 AM