ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: 2030 నాటికి 20 వేల మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తే లక్ష్యం..

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:56 AM

తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని (గ్రీన్‌ ఎనర్జీ) ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

  • రోహ్మ్‌ సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయండి

  • పానాసోనిక్‌ ప్లాంటు పెడతామంటే సహకరిస్తాం

  • ఆయా కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం

  • ముగిసిన విదేశీ పర్యటన.. నేడు హైదరాబాద్‌కు రాక

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని (గ్రీన్‌ ఎనర్జీ) ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా గురువారం ఆయన క్యోటో నగరానికి సమీపంలోని ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్‌ను సందర్శించి నిర్వాహకులతో చర్చలు జరిపారు. తొలుత రోహ్మ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌ ఇనో, కంపెనీ ఉన్నతాధికారులు తకహసి, అండో తదితరులు డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికారు. వర్చువల్‌గా వివిధ దేశాల్లో తమకు గల సెమీకండక్టర్ల పరిశ్రమలను, అక్కడి ఉత్పత్తి ప్రక్రియలను భట్టికి వారు వివరించారు.


ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరిత ఇంధనాన్ని పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఈ దృష్ట్యా సెమీకండక్టర్ల ఆవశ్యకత పెరిగిందని తెలిపారు. సెమీకండక్టర్ల పరిశ్రమను సొంతంగా లేదా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో గానీ ఏర్పాటు చేయడానికి ముందుకురావాలని రోహ్మ్‌ కంపెనీ అధికారులను ఆహ్వానించారు. దీంతో పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని వారు చెప్పారు. సాయంత్రం పానాసోనిక్‌ కంపెనీ కార్యాలయంలో ఆ కంపెనీ ప్రెసిడెంట్‌ నబి నకానీషితో భట్టి సమావేశమై ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తుల గురించి మాట్లాడారు. తెలంగాణలో ఎలకా్ట్రనిక్‌ వాహనాల సంఖ్య పెరుగుతోందని, ఆర్టీసీలో పూర్తి స్థాయిలో ఎలకా్ట్రనిక్‌ బస్సులను వినియోగించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం వారికి చెప్పారు.


ఈ దృష్ట్యా తెలంగాణలో పానాసోనిక్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, అందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. అనంతరం టోజీ బౌద్ధ ఆలయాన్ని భట్టి సందర్శించారు. అక్కడి బౌద్ధ గురువు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. తెలంగాణలో పలు బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయని, వాటిని సందర్శించడానికి రావాలని బౌద్ధ గురువును భట్టి ఆహ్వానించారు. కాగా, డిప్యూటీ సీఎం విదేశీ పర్యటన గురువారంతో ముగిసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. గత నెల 24న ప్రారంభమైన విదేశీ పర్యటనలో భాగంగా తొలుత ఆయన వారం పాటు అమెరికాను సందర్శించగా.. ఆ తర్వాత జపాన్‌లో మూడ్రోజుల పాటు కొనసాగింది.

Updated Date - Oct 04 , 2024 | 03:56 AM