Bhatti Vikramarka: 2 రాష్ట్రాల ప్రజలపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలి
ABN, Publish Date - Aug 12 , 2024 | 03:39 AM
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తిరుమల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి కరువు కాటకాలు లేకుండా పాడిపంటలతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు.
Updated Date - Aug 12 , 2024 | 03:39 AM