ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: పోటీల్లో పాల్గొంటే నైపుణ్యం పెరుగుతుంది

ABN, Publish Date - Jul 18 , 2024 | 03:37 AM

పత్రికల ఫొటోగ్రాఫర్ల నైపుణ్యం పెంపొందించుకొనేందుకు ఉత్తమ వార్త చిత్రం పోటీలవంటివి ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

  • ఉత్తమ వార్త చిత్రం పోటీల పోస్టరును

  • ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : పత్రికల ఫొటోగ్రాఫర్ల నైపుణ్యం పెంపొందించుకొనేందుకు ఉత్తమ వార్త చిత్రం పోటీలవంటివి ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం యేటా నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త ఉత్తమ వార్త చిత్రం పోటీల గోడ పత్రికను బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.హరి మాట్లాడుతూ... ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని 30 ఏళ్లుగా ప్రతియేటా ఆగస్టులో ఫొటో జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్త ఉత్తమ వార్త చిత్రం పోటీలు నిర్వహిస్తునట్లు తెలిపారు.


ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ. 10 వేలు, ద్వితీయ బహుమతి రూ.8 వేలు, తృతీయ బహుమతి రూ. 5 వేలతో పాటు 25 మందికి రూ.2 వేల కన్సొలేషన్‌ బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆసక్తిగల ఫొటో జర్నలిస్టులు పోటీల్లో పాల్గొనేందుకు మూడు 8+8 సైజ్‌ కలర్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలను టీఎ్‌సపీజేఏ కార్యాలయం, టీయూడబ్ల్యూజే బిల్డింగ్‌, దేశోద్ధారక భవన్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌కు ఆగస్టు 10వ తేదీలోగా పంపించాలన్నారు.

Updated Date - Jul 18 , 2024 | 03:37 AM

Advertising
Advertising
<