ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం..!!

ABN, Publish Date - Jun 02 , 2024 | 08:29 AM

మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది.

telangana formation day

హైదరాబాద్: మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆవిర్భావ వేడుకలకు సంబంధించి టైమ్ లైన్ చుద్దాం పదండి.


  • ఉదయం 9.35లకు పరేడ్ గ్రౌండ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తారు.

  • 9.55కు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ స్వాగతం

  • 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ

  • 10.35కు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ

  • 10.38కు సోనియా గాంధీ ప్రసంగం (షెడ్యూల్‌లో ఉంది. అనారోగ్య కారణాల వల్ల హాజరుకావడం లేదు)

  • 10.43కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

  • 11.08కు పోలీస్ సిబ్బందికి అవార్డుల ప్రదానం


తెలంగాణ ఆవిర్భవ వేడుకల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఆవిర్భావ వేడుకల కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలొస్తున్నారు. ఆ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 08:34 AM

Advertising
Advertising