ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: రైతుబంధు నిధులు రుణమాఫీకి మళ్లింపు

ABN, Publish Date - Jul 19 , 2024 | 03:45 AM

రైతు బంధు కింద జూన్‌లో వారికి ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7,000 కోట్లను రేవంత్‌ సర్కారు రుణమాఫీకి మళ్లించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు తెలిపారు.

  • రూ.లక్ష వరకు అప్పు తీసుకున్నది 40 లక్షల మందికిపైగా అన్నదాతలు

  • 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రైతు బంధు కింద జూన్‌లో వారికి ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7,000 కోట్లను రేవంత్‌ సర్కారు రుణమాఫీకి మళ్లించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు తెలిపారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బుల్లో కొంత మొత్తాన్ని విదిల్చి, రుణమాఫీ చేస్తున్నామని పోజులు కొడుతున్నారని అన్నారు. రుణమాఫీ పేరిట రేవంత్‌ సర్కార్‌ రైతులను మోసగిస్తోందని విమర్శించారు. 40 లక్షల మందికిపైగా రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్‌ సర్కార్‌ చేసిన రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హత కల్పించారని తెలిపారు.


బీఆర్‌ఎస్‌ హయాంలో 2014లోనే రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసేందుకు రూ.16,144కోట్లు వెచ్చించి దాదాపు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. 2018లో 37లక్షల మంది రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు వెచ్చించామని తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం రూ.2లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని, అర్హులైన రైతులందరికీ వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు చేయాలని కేటీఆర్‌ గురువారం ఎక్స్‌లో డిమాండ్‌ చేశారు.కాగా, ప్రజలతో ఎలా వ్యవహరించాల్లో పోలీస్‌ సిబ్బందికి నేర్పించాలని.. ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్‌కు కేటీఆర్‌ సూచించారు. ఒక వాహనదారుడిని పోలీసులు దుర్భాషలాడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిందని, సామాన్య పౌరుడితో పోలీసులు మాట్లాడిన భాష తీవ్ర అభ్యంతరకరమన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 03:45 AM

Advertising
Advertising
<