Half Day Schools: తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట బడులు.. ఎప్పటినుంచంటే?
ABN, Publish Date - Nov 02 , 2024 | 10:05 AM
Half Day Schools: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్. త్వరలో రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. హాఫ్ డే స్కూల్స్ ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయంటే..
Telangana Half Day Schools: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్. నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వేసవి కాలం కాదు.. అలాంటప్పుడు హాఫ్‌డే స్కూల్స్ ఎందుకు పెడుతున్నారనే అనుమానం రావొచ్చు. దాని వెనుక ఓ కారణం ఉంది. ఈ నెల 6 నుంచి తెలంగాణలో కులగణన మొదలుకానుంది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను నియమించింది సర్కారు. అలాగే మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగం చేసింది. దీంతో సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటే నిర్వహించాలని నిర్ణయించారు.
కులగణన కోసం ఇంటింటికీ..
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టీచర్లు స్కూళ్లలో పనిచేయాలి. అనంతరం కులగణన కోసం ఇంటింటికీ వెళ్లాలి. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను సర్కారు నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటాను అధికారులు సేకరించనున్నారు. దీని కోసం వారికి ప్రత్యేకంగా కిట్లను కూడా అందజేశారు. ఈ నెల 13వ తేదీ వరకు కులగణన మీద ప్రజాసేకరణ ఉంటుందని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు.
Also Read:
బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
గృహ నిర్బంధంలో అఘోరీ
For More Telangana And Telugu News
Updated Date - Nov 02 , 2024 | 10:22 AM