ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MBBS: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమం

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:27 AM

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్థానికతపై హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • వారంలోపే కన్వీనర్‌ కోటా షురూ

  • సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం

  • స్థానికతపై రాష్ట్ర విద్యార్థులకు సుప్రీంలో ఊరట

  • హైకోర్టుకెళ్లినవారు కౌన్సెలింగ్‌కు హాజరవ్వొచ్చు

  • ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమం

హైదరాబాద్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్థానికతపై హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని, ఆ మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. దీంతో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సుప్రీం ఆదేశాలను చూసిన తర్వాత కౌన్సెలింగ్‌ ఎలా చేపట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


మూడు, నాలుగు రోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది. నెల చివరికి తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేయనున్నట్లు సమాచారం. తొలుత కన్వీనర్‌, తర్వాత మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ అక్టోబరు 15 నాటికి పూర్తి కానుంది. అన్ని రకాల కౌన్సెలింగ్‌ను అక్టోబరు చివరికి పూర్తిచేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. కాగా, ఈ ఏడాది నీట్‌లో తెలంగాణ నుంచి 47 వేల మంది అర్హత సాధించారు. ఎంబీబీఎ్‌సలో కన్వీనర్‌ కోటా సీట్ల కోసం 17,654 మంది పేర్లను రిజిష్ట్రేషన్‌ చేసుకోగా, యాజమాన్య, సి- కేటగిరీలో మరో 6,468 మంది దరఖాస్తు చేసుకున్నారు.


అఖిల భారత కోటాకు చెందిన 15 శాతం సీట్లు, డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్శిటీలు, ఈఎ్‌సఐసీ, ఏఎ్‌ఫఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తియింది. ఇంకా రెండు విడతలు జరగాల్సి ఉంది. ఆలిండియా కోటా తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన వెంటనే మనదగ్గర మొదటి విడత నిర్వహించాలి. ఈ ఏడాది మాత్రం స్థానికత కారణంగా బాగా ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కన్వీనర్‌ కోటా రెండు విడతల కౌన్సెలింగ్‌ ముగిసింది.

Updated Date - Sep 21 , 2024 | 04:27 AM