IPS Transfers: ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధం
ABN, Publish Date - Oct 17 , 2024 | 03:07 AM
రాష్ట్రంలో మరోసారి ఐపీఎ్‌సల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పోలీసు శాఖలో అత్యంత కీలకమైన సైబరాబాద్ సీపీకి స్థానచలనం కలిగే అవకాశమున్నట్లు సమాచారం.
‘ఫోన్ ట్యాపింగ్’ దర్యాప్తు అధికారికీ స్థానచలనం!
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అప్రాధాన్య పోస్టులు
కేంద్ర సర్వీసు నుంచి వచ్చిన అకున్ సబర్వాల్‌కు కీలక
పోస్టు.. డిప్యుటేషన్‌పై ఎన్‌పీఏకు ఇద్దరు ఐపీఎస్‌లు?
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి ఐపీఎ్‌సల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పోలీసు శాఖలో అత్యంత కీలకమైన సైబరాబాద్ సీపీకి స్థానచలనం కలిగే అవకాశమున్నట్లు సమాచారం. సైబరాబాద్ సీపీగా ఉన్న అవినాశ్ మహంతి కేంద్ర సర్వీ్‌సకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో సర్కారు ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. సైబరాబాద్ సీపీ రేసులో ప్రధానంగా ఇద్దరు అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారిని సైతం మార్చే అవకాశమున్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో కొందరు ఐపీఎ్‌సల అవినీతి, అధికార దుర్వినియోగం పోలీసుల శాఖలో తీవ్ర దుమారం రేపింది.
ఇప్పటికే వారి విషయంలో సీరియ్‌సగా ఉన్న ప్రభుత్వం.. తాజా బదిలీల్లో వారిని అప్రాధాన్య పోస్టులకు మార్చనుంది. ఇప్పటివరకు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో కొనసాగి తిరిగొచ్చిన అకున్ సబర్వాల్‌కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా లేదా మరో కీలక బాధ్యత అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్దరు ఐపీఎ్‌సలు డిప్యుటేషన్‌పై జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)కు వెళ్లేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయింది. కాగా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఐదుగురు ఐపీఎ్‌సలు పరిశీలకులుగా వెళ్తున్నారు. వారిలో నారాయణ నాయక్, తరుణ్ జోషి, ఎల్‌ఎస్ చౌహాన్, చందనా దీప్తి, రోహిణి ప్రియదర్శిని ఉన్నారు.
Updated Date - Oct 17 , 2024 | 03:07 AM