ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:09 AM

రాష్ట్రంలో విద్యుత్తు శాఖలో ఖాళీలను గుర్తించామని, త్వరలో ఆయా పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

  • మెరుగైన విద్యుత్తు కోసం సంస్కరణలు

  • శాఖలో సమస్యలుంటే 1912కు ఫోన్‌ చేయండి

  • పేద విద్యార్థుల కోసం సమీకృత గురుకులాలు: భట్టి విక్రమార్క

ఖమ్మం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో విద్యుత్తు శాఖలో ఖాళీలను గుర్తించామని, త్వరలో ఆయా పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల విద్యుత్‌శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించామని చెప్పారు. మెరుగైన విద్యుత్తును అందించేందుకు, విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు అనేక సంస్కరణలు చేపట్టబోతున్నామన్నారు. అందులో భాగంగా శాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయబోతున్నామని పేర్కొన్నారు.


విద్యుత్తు శాఖలో ఎక్కడైనా సమస్యలు ఉన్నా, ఎవరైనా డబ్బులు అడిగినా 1912కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేసిన ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుని పర్యవేక్షణ చేస్తామన్నారు. వరదల సమయంలో విద్యుత్తు అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు వృత్తిపరంగా మెళవకులు నేర్పేందుకు ఒక కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. థర్మల్‌ పవర్‌తో పాటు సౌర, జల విద్యుత్‌, పవన విద్యుత్‌.. మొత్తం 20వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యనందించేందుకు అంతర్జాతీయ సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 11న పలుచోట్ల వీటికి శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు.


  • విశ్వనగరం కోసమే మూసీ ప్రక్షాళన

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని సంకల్పించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇది చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీని అభివృద్ధి చేస్తామని బీఆర్‌ఎస్‌ పదేళ్లు అబద్ధాలతో కాలం గడిపిందని విమర్శించారు. మూసీలోని మురికిని వేరు చేసి మంచినీటిని ప్రవహింపచేస్తే హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నదికి పక్కన దుర్వాసనలో జీవిస్తున్న వారికి మెరుగైన పునరావాసం అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మూసీ అభివృద్ధి విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 04:09 AM