ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajiv Health Scheme: మరిన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు!

ABN, Publish Date - Nov 06 , 2024 | 02:32 AM

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

  • అనుమతుల జారీని సులభతరం చేయాలని ప్రభుత్వ కీలక నిర్ణయం

  • 13 అంచెల విధానం 10కి కుదింపు

  • కనీసం 50 పడకలు ఉంటే అవకాశం

  • రాష్ట్రంలో ప్రస్తుతం 374 ఎంప్యానెల్‌ ఆస్పత్రులు.. మరో 150 వరకు పెరగొచ్చు

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రిగా నమోదయ్యేందుకు ఉన్న నిబంధనల్లో కొన్నింటిని మార్చి, అనుమతులను సులభతరం చేయనుంది. కనీసం 50 పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ అయ్యేందుకు అవకాశం కల్పించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 150 పైచిలుకు వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ అయ్యేందుకు అవకాశం కలుగుతుంది. సోమవారం ఆరోగ్యశ్రీపై మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాఽధికారులతో సమీక్ష నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో జనాభాకు తగ్గట్లుగా ఆరోగ్యశ్రీ అనుంబంధ ఆస్పత్రులు లేవు.


ప్రస్తుతం 374 మాత్రమే ఉన్నాయి. వీటిని పెంచడం ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తేవడంతో పాటు వారికి నచ్చిన ఆస్పత్రికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఏదైనా ప్రైవేటు ఆస్పత్రి ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ కావాలంటే 13 అంచెలు దాటుకొని రావాలి. ఎక్కడ ఆటంకం ఏర్పడినా దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. అంతేకాక ఎప్పుడో కానీ దరఖాస్తులు స్వీకరించడం లేదు. దీంతో 13 అంచెలను 10కి కుదించనున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రులకు అనుమతిపై నిర్ణయం తీసుకునే ఈడీసీ (ఎంప్యానెల్‌ డిసిప్లినరీ కమిటీ)ని రద్దు చేయనున్నట్లు సమాచారం. క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టంలో నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు, అర్హత గల వైద్యులు ఉన్న ఆస్పత్రులకు అవకాశం కల్పించనున్నారు. అలాగే ఈ ఆస్పత్రుల్లో ఆర్థోపెడిక్‌, పాలీట్రామా సేవలను మరింత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.


  • బిల్లుల చెల్లింపు విధానంలో మార్పు!

గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. వాటిని ప్రస్తుతం మెల్లమెల్లగా చెల్లిస్తూ వస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు నెలకు సగటున రూ.100 కోట్ల వరకు బిల్లులు అవుతున్నాయి. వాటిలో కనీసం రూ.80 కోట్లైనా చెల్లిస్తే వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఉంటుందని సర్కారు యోచిస్తోంది. బిల్లులు చెల్లించే విధానంలోనూ మార్పు తీసుకురావాలని భావిస్తోంది. ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తే.. మరుసటి నెల ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాలన్న యోచనలో ఉంది. దీంతో కచ్చితంగా ప్రతీ రెండు నెలలకోసారి బిల్లులు వస్తాయన్న నమ్మకం ఆస్పత్రులకు కలుగుతుంది. ఆరోగ్యశ్రీలో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఉంటుంది. గతంలో బకాయిలు రాకపోవడంతో మెజారిటీ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను దాదాపు నిలిపివేశాయి. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు.

Updated Date - Nov 06 , 2024 | 02:32 AM