ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

ABN, Publish Date - Sep 15 , 2024 | 04:01 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

  • రాష్ట్రంలో వరద నష్టం 10,330 కోట్లు: పొంగులేటి

నేలకొండపల్లి, సెప్టెంబరు 14: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కట్టుకాచారం గ్రామంలో శనివారం వరదలతో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించిందని, ప్రాథమిక వరద నష్టం రూ.10,330 కోట్లుగా అంచనా వేసినట్లు చెప్పారు.


వరద విపత్తులకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ విపత్తులు సంభవిస్తే ధీటుగా ఎదుర్కునేందుకు రాష్ట్ర బృందాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో విపత్తు నిర్వహణ కోసం కేంద్రం కేటాయించిన నిధులు సుమారు రూ.1,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదన్నారు. గత ప్రభుత్వం ఈ నిధులను నిజంగా ఖర్చు పెట్టి లెక్కలు చూపించలేక పోయిందా.. లేదా? అనే విషయంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను అడిగిన మాట వాస్తవమేనని, త్వరలో ముఖ్యమంత్రి, తాను, అధికారుల బృందం రాష్ట్రానికి నిధుల సహాయం కోసం ప్రధానిని కలువబోతున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Sep 15 , 2024 | 04:01 AM

Advertising
Advertising