ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IAS Transfers: మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు..

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:34 AM

రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.

  • యువజన, పర్యాటక కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌.. పురావస్తు బాధ్యతలూ

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ పూర్తి స్థాయి కమిషనర్‌గా ఇళంబర్తి

  • ఆరోగ్యశ్రీ సీఈవోగా శివశంకర్‌ లోతేటి.. పంచాయతీ రాజ్‌ డైరెక్టర్‌గా సృజన

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఐఏఎస్‌ అధికారులు పనిష్మెంట్‌గా భావించే పురావస్తు శాఖ సంచాలకురాలిగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలూ నిర్వర్తించాలని ఆదేశించింది. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి, గవర్నర్‌ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశంకు కొంచెం ఉపశమనం కలిగించింది. ఆయనను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోస్టు నుంచి ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఈ.శ్రీధర్‌ను బదిలీ చేసి.. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించింది. దేవాదాయ శాఖ కమిషనర్‌ జెండగె హనుమంతును ఆ పోస్టు నుంచి రిలీవ్‌ చేసింది. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం దేవాదాయ కమిషనర్‌గా చేసే అధికారి వయసు 45 ఏళ్లు ఉండాలి. కానీ... హనుమంతుకు అంతకంటే తక్కువ వయసు ఉండడంతో ఆయనను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. రవాణా శాఖ కమిషనర్‌ ఇళంబర్తిని కీలకమైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ కేడర్‌కు వచ్చిన ఐఏఎస్‌ అధికారులు శివశంకర్‌ లోతేటికి ఆరోగ్యశ్రీ సీఈవోగా, సృజనకు పంచాయతీ రాజ్‌ డైరెక్టర్‌గా, చేవూరి హరికిరణ్‌కు ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగులు ఇచ్చింది.


  • ఐఎ్‌ఫఎస్‌ అధికారుల బదిలీలు

పలువురు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీ్‌స(ఐఎ్‌ఫఎస్‌) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ కార్యాలయంలో ఐటి, వర్కింగ్‌ ప్లాన్‌ విభాగంలో చీఫ్‌ కన్జర్వేటర్‌గా ఉన్న ప్రియాంక వర్ఘి్‌సను చార్మినార్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా బదిలీ చేశారు. హైదరాబాద్‌లో డిప్యూటీ కన్జర్వేటర్‌గా ఉన్న శివాల రాంబాబును మహబూబ్‌నగర్‌ జోగులాంబ సర్కిల్‌ జిల్లా అటవీశాఖ అధికారిగా, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. నెహ్రూ జూపార్క్‌ క్యూరేటర్‌గా ఉన్న డాక్టర్‌ సునీల్‌ ఎస్‌ హీరేమత్‌ను జూపార్క్‌ల డైరెక్టర్‌గా, ఆయన స్థానంలో భూపాలపల్లి జిల్లా అటవీ శాఖాధికారి జె.వసంతను నియమించారు. సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల అటవీశాధికారులుగా పి.శ్రీనివాసరావు, మందాడి నవీన్‌ రెడ్డిని నియమించారు.

మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు

Updated Date - Nov 12 , 2024 | 04:34 AM