ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anganwadi Workers: 2 నెలల ముచ్చటే!

ABN, Publish Date - Nov 11 , 2024 | 03:37 AM

రాష్ట్రంలోని పలు మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పది నెలల క్రితం ప్రధాన అంగన్‌వాడీలుగా చేిసినా సిబ్బందికి పాత వేతనమే ఇస్తున్నారు. జనాభా, లబ్ధిదారులు తదితర 13 అంశాలను ప్రామాణికంగా తీసుకుని జనవరిలో ప్రభు త్వం వీటిని అప్‌గ్రేడ్‌ చేసింది.

  • జనవరిలో ప్రధాన కేంద్రాలుగా మినీ అంగన్‌వాడీలు

  • ఏప్రిల్‌, మేలో మాత్రమే సిబ్బందికి పెంచిన జీతాలు

  • సాంకేతిక సమస్యతో జూన్‌ నుంచి పాత వేతనాలే..

జగిత్యాల, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పది నెలల క్రితం ప్రధాన అంగన్‌వాడీలుగా చేిసినా సిబ్బందికి పాత వేతనమే ఇస్తున్నారు. జనాభా, లబ్ధిదారులు తదితర 13 అంశాలను ప్రామాణికంగా తీసుకుని జనవరిలో ప్రభు త్వం వీటిని అప్‌గ్రేడ్‌ చేసింది. పెంచిన వేతనంతో పాటు ఇతర సౌకర్యాలను ఏప్రిల్‌ నుంచి వర్తింపజేస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సుమా రు 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను 31,711 ప్రధాన, 3,989 మినీ అంగన్‌వాడీలు. గ్రామాల్లో 3,160, పట్టణాల్లో 42, గిరిజన ప్రాంతాల్లో 787 ఉన్నాయి. ప్రధాన అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు నెలకు రూ.13,500, మినీ అంగన్‌వాడీల వారికి రూ.7,500 చెల్లించేవారు. అప్‌గ్రేడ్‌ చేయడంతో అందరికీ సమాన వేతనం లభించే అవకాశం ఏర్పడింది. ఏప్రిల్‌, మే నెలలో రూ.13,500 ఇచ్చినా, జూన్‌ నుంచి మళ్లీ రూ.7,500 మాత్రమే జమ చేస్తున్నారు. ట్రెజరీలో సాంకేతిక సమస్యనే దీనికి కారణమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదేమిటంటూ పలువురు మినీ అంగన్‌వాడీ ఉపాధ్యాయులు ఇటీవల రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, కమిషనర్‌ శ్రీదేవిని కలిసి వినతిపత్రాలు అందించి గోడు వెళ్లబోసుకున్నారు.


కాగా, ప్రధాన కేంద్రంలో ఒక ఉపాధ్యాయిని, ఒక సహాయకురాలు విధులు నిర్వహిస్తుండగా.. అప్‌గ్రేడ్‌ అయిన మినీ కేంద్రాల్లో ఒక్క ఉపాధ్యాయిని మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరి పనిని ఒకరే చేయాల్సి రావడంతో సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. అదనంగా సహాయకురాలి పోస్టు అనివార్యమవుతోంది. ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా నియామకం జరిగే అవకాశం ఉందని భావించినా, ఆ దిశగా అడుగులు పడకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న అప్‌గ్రేడ్‌ పూర్తయినప్పటికీ పాత వేతనమే అందుతోందని సమస్యను పరిష్కరించాలని జగిత్యాల జిల్లా రాయికల్‌ గ్రామానికి చెందిన బైరి ఉమారాణి కోరుతున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ కాకపోవడంతో పాత వేతనం అందుతోందని.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే మాదిరిగా ఉందని సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని జగిత్యాల జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్‌ తెలిపారు.

Updated Date - Nov 11 , 2024 | 03:37 AM