ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం

ABN, Publish Date - Oct 23 , 2024 | 04:31 AM

రాష్ట్రంలో గత రెండేళ్లలో పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. 2022 నుంచి పిడుగుపాటుకు గురై మృతి చెందిన 16 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున రూ.96 లక్షలను మంజూరు చేసింది.

  • 16 కుటుంబాలకు రూ.96 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం

  • విడుదల చేసిన విపత్తుల నిర్వహణ శాఖ

  • 2022 నుంచి 16 మంది ఎక్స్‌గ్రేషియా పెండింగ్‌

  • ఒక్కొక్కరికి 6 లక్షల చొప్పున మంజూరు

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత రెండేళ్లలో పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. 2022 నుంచి పిడుగుపాటుకు గురై మృతి చెందిన 16 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున రూ.96 లక్షలను మంజూరు చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. పిడుగుపాటు మృతుల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి ఐదుగురు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందినవారు ముగ్గురు, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున, భద్రాది కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్‌, నల్లగొండ జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరి కుటుంబాలకు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదు.

వీరి వివరాలు విపత్తుల నిర్వహణ శాఖకు అందినా సకాలంలో పరిహారం ఇవ్వలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన విపత్తుల నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌.హరీశ్‌.. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియాలను విడుదల చేశారు. వాస్తవానికి పిడుగుపాటు మృతులకు చెలిస్తున్న రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియాలో కేంద్ర ప్రభుత్వమే జాతీయ విపత్తు కింద రూ.4 లక్షలు చెల్లిస్తోంది. 2018 వరకు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు మాత్రమే చెల్లించేవారు. అయితే.. కేంద్రం ఇస్తున్న ఈ మొత్తం సరిపోవడం లేదంటూ రాష్ట్రంలోని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదనంగా మరో రూ.2 లక్షలు కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం రూ.6 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొంటూ జీవో నంబర్‌ 1ని తీసుకొచ్చింది.

Updated Date - Oct 23 , 2024 | 04:31 AM