DS Chauhan: యూట్యూబ్ చానల్ ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ
ABN, Publish Date - Dec 14 , 2024 | 05:18 AM
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ‘‘కమిషనర్ సివిల్ సప్లైస్’’ పేరుతో ఈ యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ‘‘కమిషనర్ సివిల్ సప్లైస్’’ పేరుతో ఈ యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ శుక్రవారం ఆ చానల్‌ను ప్రారంభించి, దాని ద్వారా రైతులకు సందేశం ఇచ్చారు. ధాన్యం సేకరణ విధానం, రాష్ట్రంలో జరుగుతున్న కొనుగోళ్లు, సన్నధాన్యానికి రూ.500 బోనస్.. వంటి అంశాలపై ప్రసంగించారు.
రైతులకు నేరుగా సమాచారం చేరవేయడానికి ఈ చానల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి రూ.500 బోనస్ వస్తుందా.. లేదా? ప్రైవేటు ట్రేడర్లు, రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసినప్పుడు రూ.2,820 చొప్పున చెల్లిస్తున్నారా.. లేదా? ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులందరూ చానల్‌ను లైక్ చేసి, సబ్‌స్ర్కైబ్ చేయాలని కమిషనర్ కోరారు.
Updated Date - Dec 14 , 2024 | 05:18 AM