ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Reservoir construction: ఇచ్చంపల్లి వద్దు!

ABN, Publish Date - Jul 16 , 2024 | 04:52 AM

గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి అంగీకరించేది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • ఆకస్మిక వరద వస్తే సమ్మక్క సాగర్‌కు ఇబ్బంది

  • అనుసంధానం నీళ్లలో సగం మాకే ఇవ్వాలి

  • గోదావరి-కావేరీ సమావేశంలో తెలంగాణ

  • ఇచ్చంపల్లి, సమ్మక్కలకు ఒప్పుకోం: ఛత్తీ్‌సగఢ్‌

  • ఇబ్బందనుకుంటే ఇంద్రావతిపై రిజర్వాయర్‌

  • తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌కు కేంద్రం ప్రతిపాదన

  • పోలవరం నుంచైతే మాకు ఓకే: ఆంధ్రప్రదేశ్‌

  • త్వరలో రాష్ట్రాలతో భేటీ: జలశక్తి శాఖ

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి అంగీకరించేది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇచ్చంపల్లి నుంచి కేవలం 24 కిలోమీటర్ల దిగువలోనే తుపాకులగూడెం (సమ్మక్క సాగర్‌) బ్యారేజీ ఉందని, ఇచ్చంపల్లి నుంచి వరదను అకస్మికంగా వరద విడుదల చేయాల్సి వస్తే ఆ వరదను నియంత్రించే పరిస్థితుల్లేవని చెప్పింది. సోమవారం జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. దీనికి ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌ కుమార్‌, అంతరాష్ట్ర వ్యవహారాల చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌ కుమార్‌ హాజరయ్యారు. తెలంగాణ అభ్యంతరాలను అనిల్‌కుమార్‌ నివేదించారు. ఇదే అంశంపై మార్చి 6న రాసిన లేఖలోని అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.


ఇచ్చంపల్లికి దిగువన 158 టీ ఎంసీలకు సరిపడా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టిందని, గోదావరి-కావేరీ అనుసంధానం కోసం ఇచ్చంపల్లి నిర్మిస్తే ఈ ప్రాజెక్టులు ఏమైపోవాలని ప్రశ్నించారు. అనుసంధానంలో కర్ణాటక వాటాకు బదులుగా కృష్ణా బేసిన్‌లో అల్మట్టి రిజర్వాయర్‌ వద్ద ఆ రాష్ట్రానికి మరో 16 టీఎంసీలు అదనంగా కేటాయిస్తే దిగువన జూరాల, శ్రీశైలం జలాశయాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం బదలాయింపులో భాగంగా ఇప్పటికే కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలను కృష్ణా నుంచి కేటాయించే కార్యక్రమం ఉందని గుర్తు చేశారు. కర్ణాటకలోని బెడ్తి-వారాదా నదుల అనుసంధానంలో తరలించే 18 టీఎంసీల్లో 9 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని కోరారు.


గోదావరి బేసిన్‌లో 968 టీఎంసీల నికర జలాల వినియోగానికి తెలంగాణ రూపొందించుకున్న ప్రణాళికలు, ఏర్పాటు చేసుకున్న సదుపాయాలపై కొత్తగా తలపెట్టిన అనుసంధానం ప్రభావం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనుసంధానంలో తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకే ఇవ్వాలన్నారు. కరువు పీడిత మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 86 శాతం భూములకు సాగునీటి వసతి లేదని ప్రస్తావించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంచే వరకు నాగార్జున సాగర్‌ను కావేరీ అనుసంధానంలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చొద్దని కోరారు. వాటాలు తేలాక సమగ్ర నీటి అధ్యయనం తర్వాతే ఎలాంటి ఇబ్బందులు లేవని తేలితేనే బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సమ్మక్కసాగర్‌ బ్యారేజీల డీపీఆర్‌ లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించాలని కోరారు.


ఇచ్చంపల్లి, సమ్మక్కకు ఒప్పుకోం: ఛత్తీ్‌సగఢ్‌

ఇచ్చంపల్లి, సమ్మక్కసాగర్‌ బ్యారేజీలతో తమ రాష్ట్రంలో ముంపు సమస్య తీవ్రంగా ఉంటుందని, ఈ రెండింటికీ అంగీకరించే ప్రసక్తే లేదని ఛత్తీ్‌సగఢ్‌ స్పష్టం చేసింది. పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధానం చేపడితే అభ్యంతరాల్లేవని ఏపీ స్పష్టం చేసింది. అనుసంధానానికి రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించడంపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభావిత రాష్ట్రాలతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్‌లపై అభ్యంతరాలుంటే కొత్తగా ఇంద్రావతిపై రిజర్వాయర్‌ కట్టి, నీటిని తరలించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని ప్రకటించారు.

Updated Date - Jul 16 , 2024 | 04:52 AM

Advertising
Advertising
<