ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: హైకోర్టు నిర్ణయం.. కేసీఆర్‌కు చెంపపెట్టు

ABN, Publish Date - Jul 02 , 2024 | 04:19 AM

విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం.. ఆయనకు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేసిన కేసీఆర్‌.. చట్టం ముందు అందరూ సమానమేనన్న సంగతి మరిచారని విమర్శించారు. ఇకనైనా జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ముందు ఆయన హాజరై వాస్తవాలు చెప్పాలన్నారు.

  • ఇకనైనా ‘కమిషన్‌’ ముందు విచారణకు హాజరవ్వాలి: ఆది శ్రీనివాస్‌

  • తుగ్లక్‌లా పాలించినందుకే కేసీఆర్‌, జగన్‌ను ఇంటికి పంపారు: యెన్నం

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం.. ఆయనకు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేసిన కేసీఆర్‌.. చట్టం ముందు అందరూ సమానమేనన్న సంగతి మరిచారని విమర్శించారు. ఇకనైనా జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ముందు ఆయన హాజరై వాస్తవాలు చెప్పాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విసిరిన సవాల్‌ మేరకే ప్రభుత్వం విచారణ కమిషన్‌ను వేసిందన్నారు. ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించి ఇప్పుడు పారిపోతారా? అంటూ నిలదీశారు. యెన్నం మాట్లాడుతూ.. విద్యుత్తు ఒప్పందాల్లో తీసుకున్న కమీషన్లు బయటపడతాయనే విచారణకు హాజరు కావడానికి కేసీఆర్‌ భయపడుతున్నారన్నారన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో పిచ్చి తుగ్లక్‌ పాలన చేసిన కేసీఆర్‌, జగన్‌లకు ప్రజలు ఇంటికి పంపారు.


వారిని ఓడించడం ద్వారా తెలుగు ప్రజలు తెలివిగల వారని నిరూపించారు’ అని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్‌ నాయక్‌కు ఏదైనా జరిగితే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులదే బాధ్యతని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అన్నారు. పదేళ్ల పాటు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. మోతీలాల్‌ నాయక్‌ను రెచ్చగొట్టి బీఆర్‌ఎస్‌ నేతలు దీక్షకు దింపారని మండిపడ్డారు. ఏడు నెలల సర్కారుపై విమర్శలు చేయడానికి హరీశ్‌కు సిగ్గుండాలన్నారు. చనగాని దయాకర్‌ మాట్లాడుతూ.. కేయూలో సునీల్‌, అశోక్‌నగర్‌లో ప్రవల్లిక చనిపోతే.. ఇతర కారణాలతో చనిపోయారంటూ తప్పుగా చిత్రీకరించింది కేటీఆర్‌ కాదా అని ఫైర్‌ అయ్యారు.


ఆ విషయం తెలిసే బీఆర్‌ఎస్‌ డ్రామాలు..

ఉద్యమ సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని అగ్గిపెట్టె దొరకలేదంటూ డ్రామాలాడి.. యువకులు, విద్యార్థుల మరణాలకు కారణమైన హరీశ్‌ ఇవాళ నిరుద్యోగల సమస్యలపై మాట్లాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించబోతున్న విషయం తెలిసే బీఆర్‌ఎస్‌ నేతలు.. కొత్త డ్రామాకు తెరలేపారని ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించింది.

వైఎస్ 75వ జయంతికి రండి! మంత్రి రాజనర్సింహకు షర్మిల ఆహ్వానం

ఈనెల 8వ తేదీన ఏపీసీసీ తరపున విజయవాడలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న వైఎ్‌సఆర్‌ 75వ జయంతి కార్యక్రమానికి రావాలని రాష్ట్ర మంత్రి దామోదర్‌ రాజనర్సింహను ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఆహ్వానించారు. మంగళవారం సీఎం రేవంత్‌ని కూడా ఆమె ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jul 02 , 2024 | 04:19 AM

Advertising
Advertising