ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maoist encounters: తెలంగాణలో పదేళ్లలో 44 ఎన్‌కౌంటర్లు

ABN, Publish Date - Dec 06 , 2024 | 04:56 AM

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ఈ పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన 44 ఎన్‌కౌంటర్లలో 96 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాష్ట్రం ఏర్పాటైన మొదటి సంవత్సరం నాలుగు సార్లు పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినా.. మరణాలు నమోదు కాలేదు.

  • 96 మంది మావోయిస్టుల మృతి

హైదరాబాద్‌,డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ఈ పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన 44 ఎన్‌కౌంటర్లలో 96 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాష్ట్రం ఏర్పాటైన మొదటి సంవత్సరం నాలుగు సార్లు పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినా.. మరణాలు నమోదు కాలేదు. 2015 నుంచి తాజాగా ఏటూరు నాగారం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టుల వైపు ప్రాణనష్టం సంభవించింది. ఈ సంవత్సరం ఆరంభం నుంచి.. అత్యధికంగా 22 మంది మావోయిస్టులు మరణించారు. ఈ పదేళ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు.


  • పటిష్ట నిఘా

తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పటిష్టంగా నిఘా కొనసాగుతోంది. 21 కంపెనీల కేంద్ర బలగాలతోపాటు.. యాంటీ-మావోయిస్టు దళం గ్రేహౌండ్స్‌ బృందాలు, ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లాల పోలీసులు, స్పెషల్‌ పార్టీలు నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. కేంద్ర నిఘా సంస్థ(ఐబీ)తోపాటు.. తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎ్‌సఐబీ), పొరుగు రాష్ట్రాల నిఘా వర్గాల సమాచారంతో క్షేత్రస్థాయి ఆపరేషన్‌ బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నాయి. రాబంధులను కూడా నక్సల్స్‌పై నిఘాకు ఉపయోగిస్తున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 04:56 AM