కృష్ణా జలాలపై విచారణలో జాప్యం వద్దు!
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:59 AM
కృష్ణా జలాల పంపిణీపై విచారణలో జాప్యం లేకుండా వెంటనే వాదనలు ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలని జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ కోరింది.
వెంటనే వాదనలు ప్రారంభించాలి
బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌ను కోరిన తెలంగాణ
నేడు ముగియనున్న క్రాస్ ఎగ్జామినేషన్
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీపై విచారణలో జాప్యం లేకుండా వెంటనే వాదనలు ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలని జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ కోరింది. ఈ మేరకు గురువారం ట్రైబ్యునల్‌లో దరఖాస్తు దాఖలు చేసింది. దీనికి తెలంగాణ నుంచి ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీనియర్ న్యాయవాదులు సి.ఎ్‌స.వైద్యనాథన్, వి.రవీందర్‌రావు, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ కుష్వీందర్ వోహ్రా, హైడ్రాలజీ నిపుణుడు చేతన్ పండిట్‌లు హాజరయ్యారు. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాదలు జయదీప్ గుప్తా, ఉమాపతి హాజరయ్యారు. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్‌పై ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో గురువారం ఏపీ తరఫు సాక్షి ఏకే గోయల్‌ను సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, రవీందర్‌రావులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
కృష్ణా బేసిన్ పరిఽధిలో ఉన్న అన్ని రిజర్వాయర్ల ఆపరేషనల్ ప్రొటోకాల్‌ను సిద్ధం చేయాల్సిందేనా? అని తెలంగాణ న్యాయవాదిని ప్రశ్నించగా.. చేయాల్సిందేనని చెప్పారు. ‘బచావత్ ట్రైబ్యునల్ గంపగుత్త కేటాయింపులు చేసిందా? లేదా? లేక ప్రాజెక్టుల వారీగా, రాష్ట్రాల వారీగా చేసిందా? మీ అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నాయి’ అని ప్రశ్నించగా.. గంపగుత్త కేటాయింపులు చేసిందని, ప్రాజెక్టుల వారీగా ఇదివరకే ఉన్న వినియోగానికి బచావత్ ట్రైబ్యునల్ రక్షణ కల్పించిందని గోయల్ బదులిచ్చారు. కామన్ రిజర్వాయర్లకు 520 టీఎంసీల నీటి అవసరాలు తీర్చడానికి జూరాల నుంచి 342 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు కదా? గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల నీటిని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ లెక్కలు చెబుతున్నారా? అని ప్రశ్నించగా.. పోలవరం (గోదావరి) నుంచి కృష్ణా డెల్టాకు తరలించే నీటిని పరిగణనలోకి తీసుకోలేదని గోయల్ తెలిపారు. ఇక ఆపరేషనల్ ప్రొటోకాల్‌పై క్రాస్ ఎగ్జామినేషన్‌ను పొడిగించరాదని తెలంగాణ నిర్ణయించడంతో శుక్రవారం పూర్తికానుంది.
Updated Date - Dec 06 , 2024 | 04:59 AM