ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: ఇక ఆర్టీసీలో అన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే

ABN, Publish Date - Oct 03 , 2024 | 04:11 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ)లో ఇకమీదట మొత్తం ఎలక్ట్రిక్‌ బస్సులను వినియోగించాలని యోచిస్తున్నామని, ఇందుకు జపాన్‌లోని తోషిబా కంపెనీ సేవలు అవసరమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దీనికి తోషిబా కంపెనీ సేవలు అవసరం.. ఫ్యుయెల్‌ సెల్‌ టెక్నాలజీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

  • సింగరేణితో కలిసి పని చేయొచ్చు

  • జపాన్‌ పర్యటనలో భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీ ఆర్టీసీ)లో ఇకమీదట మొత్తం ఎలక్ట్రిక్‌ బస్సులను వినియోగించాలని యోచిస్తున్నామని, ఇందుకు జపాన్‌లోని తోషిబా కంపెనీ సేవలు అవసరమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జపాన్‌ దేశంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా టోక్యో నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ బహుళ జాతి ఎలకా్ట్రనిక్‌, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం బధవారం సందర్శించారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్‌ ప్రెసిడెంట్‌ షిగే రిజో కవహర తదితరులు డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికారు. ఆ తర్వాత పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తోషిబా ఉత్పత్తులు, సేవలను వివరించారు. సౌర విద్యుత్తులో వినియోగించే ఫొటో వోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ తయారీ, ఫ్యుయెల్‌ సెల్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీ, శక్తిమంతమైన జనరేటర్లు, జీరో కార్బన్‌ ఎమిషన్‌ టెక్నాలజీలను వృద్ధి చేశామని తెలిపారు.


ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి ఫొటో వోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ పెద్ద సంఖ్యలో కావాల్సి ఉందని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీలో ఫ్యుయెల్‌ సెల్‌ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణలో సంబంధిత యూనిట్‌లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వక కార్యకలాపాల్లోకి ప్రవేశించనున్నదని, లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందుకు పోవచ్చని సూచించారు. ఆ తర్వాత తోషిబా ఫ్యుయెల్‌ సెల్‌ తయారీ యూనిట్‌ను సందర్శించారు.


అలాగే.. టోక్యో నగరం నుంచి ఒసాకా పట్టణానికి బుల్లెట్‌ ట్రెయిన్‌లో భట్టి విక్రమార్క వెళ్లారు. 700 కిలోమీటర్ల పొడవైన ఈ రైలుమార్గాన్ని కేవలం 2 గంటల 20 నిమిషాల్లో బుల్లెట్‌ ట్రెయిన్‌ ద్వారా చేరుకున్నారు. ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని, ట్రెయిన్‌లో సౌకర్యాలు ఎంతో బాగున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తోషిబా కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ భారతదేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే తమ యూనిట్లను ప్రారంభించామని, దీనిలో తెలంగాణ ప్రముఖమైందన్నారు. తెలంగాణ పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలంగా ఉన్నందున.. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుత ఈవీ వెహికల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని, ప్లాంట్‌ విస్తరణకు ప్రయత్నిస్తామని తెలిపారు.


  • కొత్తగా 30 ఆర్డినరీ ఎలక్ట్రిక్‌ బస్సులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు ఆర్టీసీ కొత్తగా హైదరాబాద్‌లో 30 గ్రీన్‌ సిటీ ఆర్డినరీ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఇవి ఇప్పటికే హెచ్‌సీయూ డిపోకు చేరుకున్నాయి. అక్కడ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను కూడా సిద్ధం చేసిన ఆర్టీసీ వారం రోజుల్లో ఈ బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటితో గ్రేటర్‌లో ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య 132కు చేరింది. ఈ ఏడాది చివరికల్లా గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 500 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తమ లక్ష్యమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వీటి కోసం ప్రతి డిపోలో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్‌ సిటీ ఆర్డినరీ బస్సులు ఆకర్షణీయంగా ఉన్నాయి. సిటీ ఆర్డినరీ బస్సుల తరహాలో ముందు, మధ్య భాగాల్లో డోర్లు ఉండటంతో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇవి ఒకసారి చార్జింగ్‌ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్లు నడుస్తాయి.

Updated Date - Oct 03 , 2024 | 04:11 AM