ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gandhi statue: బాపూఘాట్‌లో మహాత్ముడి శాంతి విగ్రహం

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:29 AM

స్వేచ్ఛకు చిహ్నంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’ తరహాలోనే.. బాపూ ఘాట్‌లో ఏర్పాటుచేయబోయే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని‘స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌’గా వ్యవహరించాలని ప్రభుత్వం సంకల్పించింది.

  • గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్‌ హబ్‌

  • ‘గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు’గా పేరు

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్వేచ్ఛకు చిహ్నంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’ తరహాలోనే.. బాపూ ఘాట్‌లో ఏర్పాటుచేయబోయే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని‘స్టాచ్యూ ఆఫ్‌ పీస్‌’గా వ్యవహరించాలని ప్రభుత్వం సంకల్పించింది. మూసీ సుందరీకరణ తొలివిడత పనుల్లో భాగంగా బాపూ ఘాట్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు సర్కారు నడుంబిగించిన సంగతి తెలిసిందే. ‘గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు’ పేరుతో చేపట్టే ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా అక్కడ గాంధీ బోధలను ప్రపంచానికి చాటి చెప్పే విజ్ఞాన కేంద్రం (నాలెడ్జ్‌ హబ్‌), ధ్యాన కేంద్రం, సంప్రదాయ చేతివృత్తులకు ప్రోత్సాహం ఇచ్చేలా చేనేత ప్రచార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. తెలంగాణ సంప్రదాయాలు, కళలను ప్రదర్శించేందుకు ప్రత్యేక వేదికలను నిర్మించనున్నారు. గాంధీ సిద్ధాంతాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూనే.. పర్యాటకులకు వినోదాన్ని అందించేందుకు పలు వినోద కేంద్రాలను కూడా బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేయనున్నారు. మూసీ తీరాన్ని ఆనుకుని ఉండే ఈ ఘాట్‌కు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా పచ్చిక బయళ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Nov 28 , 2024 | 04:30 AM