ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విత్తనాలు!

ABN, Publish Date - Oct 11 , 2024 | 03:28 AM

తెలంగాణ నుంచి శనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌కు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలో నిల్వ ఉన్న 25 వేల క్వింటాళ్ల శనగ విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 15 వేల క్వింటాళ్ల విత్తనాలు ఎగుమతి చేయాలని నిర్ణయించారు.

  • అచ్చెన్నాయుడుతో ఫోన్‌లో మాట్లాడిన తుమ్మల

  • 15 వేల క్వింటాళ్ల విత్తనాల ఎగుమతికి నిర్ణయం

హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి శనగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌కు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలో నిల్వ ఉన్న 25 వేల క్వింటాళ్ల శనగ విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 15 వేల క్వింటాళ్ల విత్తనాలు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ సుంకెట అన్వే్‌షరెడ్డి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. కిలోకు రూ. 90 చొప్పున ఏపీకి శనగలు విక్రయించాలని సీడ్‌ కార్పొరేషన్‌ ధర నిర్ణయించింది.


విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్‌, హమాలీ, రవాణా సహా అన్ని ఖర్చులు కలిపి రూ. 86 చొప్పున గిట్టుబాటు అవుతుండగా ఏపీకి ఎగుమతి చేయటంతో కిలోకు రూ. 4 అదనపు లాభం సీడ్‌ కార్పొరేషన్‌కు వస్తుంది. తెలంగాణ, ఏపీలో వచ్చే యాసంగి సీజన్‌లో శనగ పంట సాగుచేసే రైతులకు విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అన్వే్‌షరెడ్డి తెలిపారు. ఇలాఉండగా వచ్చే యాసంగి సీజన్‌లో 1.50 లక్షల క్వింటాళ్ల సన్నరకం వరి విత్తనాలను సీడ్‌ కార్పొరేషన్‌ నుంచి రాష్ట్ర రైతులకు పంపిణీచేసేలా టార్గెట్‌ పెట్టుకున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 03:28 AM