ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: కొత్త రేషన్‌ కార్డులు..

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:07 AM

రేషన్‌ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

  • వచ్చే నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు.. స్మార్ట్‌కార్డుల జారీ

  • ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుదిరూపు.. స్కాన్‌ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు

  • జనవరి నుంచి సన్న బియ్యం.. వచ్చే నెల నుంచే సన్నవడ్లకు 500 బోనస్‌: మంత్రి ఉత్తమ్‌

  • అక్టోబరులో ఆరోగ్య కార్డులూ జారీ చేస్తాం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబరులో కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి లేదా మరో రోజు నుంచి కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి, అదే నెలలో స్మార్ట్‌ కార్డులను ఇవ్వాలని భావిస్తోంది. ఇవి జేబులో పట్టేంత పరిమాణంలో ఉండనున్నాయి. రేషన్‌షాపులో కార్డును స్కాన్‌ చేయగానే బియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.


సోమవారం రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ అధ్యక్షతన జలసౌధలో జరిగింది. దీనికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశం వివరాలను మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. రేషన్‌కార్డుల కోసం అక్టోబరులో దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించారు. రేషన్‌, హెల్త్‌కార్డులను వేర్వేరుగా ఇస్తామని చెప్పారు. కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకు నెలాఖరులోగా తుదిరూపు ఇస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 3,38,07,794 జనాభాకుగాను 91,68,231 కార్డులు ఉండేవని, వివిధ కారణాలతో 2,46,324 కార్డులను రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.81 కోట్ల మందికి 89.96 లక్షల కార్డులున్నాయని తెలిపారు.


ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్రం ఖాతాలో 54.45 లక్షల కార్డులు(1.91 కోట్ల మంది)కి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతీ మనిషికి ఐదు కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిలో బియ్యం అందుతున్నాయని స్పష్టం చేశారు. మరో 35.51 లక్షల కార్డులు (90.01 లక్షల మందికి) రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో ఉన్నాయని.. ఇందులో ఒకొక్కరికి 6 కిలోల బియ్యం వస్తున్నాయని తెలిపారు. కార్డుల జారీకి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిబంధన ఉందని, దీనిపై అధ్యయనం చేశామని వెల్లడించారు.


ఆదాయ పరిమితిపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు. కార్డుల జారీపై వివిధ రాజకీయ పక్షాలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాశామని, ఈనెల 19లోపు వారి అభిప్రాయాలు చెప్పడానికి గడువు ఇచ్చామని పేర్కొన్నారు. 21న మరోమారు మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుదిరూపు ఇస్తామని వెల్లడించారు. కార్డుల జారీ అనంతరం జనవరి నుంచి రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు. కాగా, ఖరీఫ్‌ ధాన్యం సేకరణ అక్టోబరులో ప్రారంభం కానుందని, ఈ సీజన్‌ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నామని మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు.


  • ఎన్నికల తాయిలాలుగా కార్డులిచ్చారు: పొంగులేటి

గత పదేళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు 49,476 మాత్రమేనని.. అది కూడా ఉప ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి మాత్రమే జారీ చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు. పదేళ్లలో 5,98,000 కార్డులను రద్దు చేయగా.. 6,47,479 కార్డులు జారీ చేశారని.. అంతిమంగా ఇచ్చిన కార్డులు 49 వేలు మాత్రమేనని తెలిపారు. గతంలో రేషన్‌కార్డులు, ఆసరా పెన్షన్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పట్టాలు ఉప ఎన్నికలు వచ్చినప్పుడే ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులందరికీ అక్టోబరులో రేషన్‌ స్మార్ట్‌ కార్డులు, హెల్త్‌కార్డులు వేరుగా జారీ చేస్తామని ప్రకటించారు. కార్డుల జారీపై ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామని.. ఇప్పటిదాకా 15-16 మంది ప్రజా ప్రతినిధులు మాత్రమే కార్డులపై అభిప్రాయాలు తెలియజేశారని శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

Updated Date - Sep 17 , 2024 | 06:36 AM

Advertising
Advertising