ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jupally Krishna Rao,: అమెరికాలో తెలంగాణ టూరిజం స్టాల్‌

ABN, Publish Date - Oct 11 , 2024 | 03:31 AM

అమెరికా లాస్‌వెగా్‌సలోని మాండలే బేలో ’ఐమెక్స్‌-అమెరికా 2024’ ట్రేడ్‌ షో లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ టూరిజం స్టాల్‌ను ప్రారంభించారు.

  • పర్యాటక రంగంలో భాగస్వాములకు ప్రోత్సాహం

  • ’ఐమెక్స్‌-అమెరికా 2024’ ట్రేడ్‌ షోలో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అమెరికా లాస్‌వెగా్‌సలోని మాండలే బేలో ’ఐమెక్స్‌-అమెరికా 2024’ ట్రేడ్‌ షో లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ టూరిజం స్టాల్‌ను ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన విదేశీ స్టాళ్లను మంత్రి జూపల్లి సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక రంగ విశిష్టతలపై ఆయన మీడియా, ట్రావెల్‌ సొల్యూషన్స్‌ ప్రతినిధులు, తెలుగు అసోసియేషన్‌ సభ్యులతో చర్చించారు.


పెట్టుబడులతో పాటు పర్యాటక రంగంలో భాగస్వాముల సహకారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని మంత్రి చెప్పారు. తెలంగాణలో పర్యటించాలని ఆయా దేశాల ప్రతినిధులకు మంత్రి జూపల్లి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. ప్రకాష్‌ రెడ్డి, పర్యాటక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.ఎస్‌. ఓంప్రకాశ్‌, పర్యాటక సంస్థ జిఎం కె.అంజి రెడ్డి, హెచ్‌సీబి సిఇఓ గ్యారీ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2024 | 03:31 AM