ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sreedhar Babu: రూ.3 వేల కోట్లు.. 10 వేల ఉద్యోగాలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:23 AM

లైఫ్‌ సైన్సెస్‌ ఏకోసిస్టమ్‌లో కొత్త శకానికి జీనోమ్‌ వ్యాలీ నాంది పలికిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు.

  • మూడు కంపెనీల కేంద్రాలు.. లారస్‌లాబ్స్‌, బయోపోలిస్‌, 3జీవీ ప్రారంభం

  • ఆసియాలోనే అత్యున్నత లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా తెలంగాణ: శ్రీధర్‌బాబు

మూడుచింతలపల్లి, సెప్టెంబరు 16: లైఫ్‌ సైన్సెస్‌ ఏకోసిస్టమ్‌లో కొత్త శకానికి జీనోమ్‌ వ్యాలీ నాంది పలికిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. ఆసియాలోనే అత్యున్నత లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా తెలంగాణ అవతరించిందన్నారు. దేశంలోనే తొలి వ్యవస్థీకృత లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌, పరిశోధన, అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ ఎదుగుతోందన్నారు. అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలతో లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ తన ఖ్యాతిని పెంచుకుంటోందని తెలిపారు. రూ.3,000 కోట్ల పెట్టుబడులతో మూడు కంపెనీలు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌ పేట మండలంలోని జినోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లారస్‌ ల్యాబ్స్‌కు చెందిన పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి) కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.


లారస్‌ ల్యాబ్స్‌.. కేఆర్‌కేఏ సంస్థలో కలిసి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. తయారీ కేంద్రంతోపాటు కొత ్త ఆర్‌ అండ్‌ డీ కేంద్రానికి లారస్‌ వచ్చే నాలుగేళ్లలో రూ.2,250 కోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 2,800 మంది నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. ప్రపంచంలో తొలి ఐఎ్‌ఫసీ-ఎడ్జ్‌ అడ్వాన్స్‌డ్‌ సర్టిఫైడ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కేంద్రం ‘3జీవీ’ని మంత్రి ప్రారంభించారు. ఆర్‌ఎక్స్‌ ప్రొపెలెంట్‌ కంపెనీ రూ.105 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 1.5 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే బయోపోలిస్‌ అనే సంస్థ రూ.700 కోట్లతో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన పరిశోధనా క్యాంప్‌సకు శంకుస్థాపన చేశారు.


ప్రయోగాలు, ఆర్‌ అండ్‌ డి సెంటర్లు, అంకుర సంస్థలకు ఇది ఉపయోగపడనుంది. దీని వల్ల దాదాపు 6,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తంగా రూ.3వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జీనోమ్‌ వ్యాలీలో ఫేస్‌-2 కింద 300 ఎకరాల్లో చేపట్టనున్న కొత్త ప్రాజెక్టు ఇంటర్‌నేషనల్‌ లైఫ్‌ సైన్స్‌ స్వ్కేర్‌(హెచ్‌ఐఎల్‌ఎ్‌స) బ్లూప్రింట్‌, లోగో తుర్కపల్లి జినోమ్‌వ్యాలీలో మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించారు. నూతన అవిష్కరణకు సంబంధించిన సానుకూల వాతావరణాన్ని తాము కల్పిస్తామని, దీనిని సద్వినియోగం చేసుకుని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి శ్రీధర్‌ బాబు సూచించారు.


మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించి ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్రీకృత రసాయన శుద్ధి ప్లాంటు, రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంపొందించడం లాంటి సదుపాయాలతో జీనోమ్‌ వ్యాలీని ఒక ఆకర్షణీయ ఉత్పాదన, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అనంతరం 30మంది పలు పరిశ్రమల యజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని భవిష్యత్తును రూపొందించడానికి అవిష్కరణ, అవకాశాలపై చర్చించారు. వీరిలో భారత్‌ బయోటెక్‌, సింజెన్‌, బయోలాజికల్‌ ఈ, తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 02:23 AM

Advertising
Advertising