Rainfall Statistics: 4 రోజుల పాటు వర్షాలు..
ABN, Publish Date - Oct 16 , 2024 | 04:09 AM
తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
యెల్లో అలెర్ట్ జారీ .. నైరుతి నిష్క్రమణ
ఈశాన్య రుతుపవనాల రాక
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జూన్ నుంచి అక్టోబరు 15 మధ్య కాలం లో విస్తారంగా వర్షాలు కురిశాయని తెలిపింది. నైరుతిలో రాష్ట్ర సగటు వర్షపాతం 738 మి.మీ. కాగా... ఈ ఏడాది అది 962 మి.మీ.గా నమోదైంది. గతేడాది 861 మి.మీ. వర్షపాతం నమోదైంది.
జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో ప్రతీనెలా సగటున 200మి.మీ. పైగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి శనివారం వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నాలుగు రోజులకు ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
Updated Date - Oct 16 , 2024 | 04:09 AM