ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పని చేయని టీ-యాప్‌ ఫోలియా

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:18 AM

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టీ-యాప్‌ ఫోలియో అప్లికేషన్‌ పనిచేయకపోవడంతో ప్రభుత్వ పెన్షన్‌ తీసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా యాప్‌ బంద్‌ కావటంతో లైఫ్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయడానికి అవస్థలు పడుతున్నారు.

  • 15 రోజులుగా సేవలకు అంతరాయం

  • ప్రభుత్వ పెన్షన్‌ లబ్ధిదారులకు ఇబ్బందులు

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టీ-యాప్‌ ఫోలియో అప్లికేషన్‌ పనిచేయకపోవడంతో ప్రభుత్వ పెన్షన్‌ తీసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా యాప్‌ బంద్‌ కావటంతో లైఫ్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయడానికి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పింఛను లబ్ధిదారులు తాము బతికే ఉన్నామని తెలుపుతూ ఏటా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. దీనిని టీ-యాప్‌ లేదా పింఛను ఖాతా ఉన్న బ్యాంకు, పోస్టాఫీసు, మీ సేవా కేంద్రాల ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. నవంబరు నుంచి మూడు నెలల వ్యవధిలో లైఫ్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయకపోతే పింఛను నిలిచిపోయే అవకాశం ఉంది.


నడవలేని స్థితిలో ఉన్న వారు యాప్‌ ద్వారా వివరాలను నమోదు చేసుకుంటారు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇటీవల తెలంగాణ పింఛనుదారుల సమాజ్‌ ప్రధాన కార్యదర్శి ఎంఏ కరీమ్‌ ఈ నెల 13న ఐటీ కార్యదర్శికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ పింఛనుదారుల సంఘం అధ్యక్షుడు కె.లక్ష్మయ్య ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రాష్ట్రంలోని 2.86 లక్షల మంది పింఛనుదారుల్లో 30 శాతం మంది నడవలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. అధికారులు సమస్యపై దృష్టిసారించి యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 16 , 2024 | 04:18 AM