ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: ఉత్తరాదిపై తెలుగు వారి ప్రభావమే ఎక్కువ..

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:51 AM

ఉత్తరాది ప్రభావం తెలుగువారిపై పడకముందే తెలుగువారు ఉత్తరాదిపై ప్రభావం చూపారని ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఎ. కృష్ణారావు అన్నారు.

  • సాహిత్య అకాడమీ సదస్సులో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది ప్రభావం తెలుగువారిపై పడకముందే తెలుగువారు ఉత్తరాదిపై ప్రభావం చూపారని ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఎ. కృష్ణారావు అన్నారు. ఉత్తరాదిపై తెలుగు వారి ప్రభావమే ఎక్కువని ఆయన చెప్పారు. బుధవారం ఢిల్లీలో హిందీ- ఇతర భారతీయ భాషలు అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. గాథా సప్తశతిని రచించించిన హాలుడు, బృహత్కథా మంజరిని రచించిన గుణాఢ్యుడు తెలుగు వారేనని చెప్పారు. భక్తి యుగం తెలుగునాట నుంచే ఉత్తరాదికి వ్యాప్తి చెందిందని, వల్లభాచార్యులు శ్రీకృష్ణ లీలలపై సూరదాసును ప్రభావితం చేశారని తెలిపారు.


తులసీదాస్‌ రామచరిత మానస్‌ రచించకముందే భాస్కర, రంగనాథ రామాయణాలు తెలుగులో వచ్చాయని అన్నారు. తెలుగువాడైన రామానుజుడి విశిష్టాద్వైత ప్రభావం ఉత్తరాదిన ఎంతో ఉందని, హిందీలో వర్ధిల్లిన అన్ని భాషా సాహిత్య ఉద్యమాలు తెలుగునాట ముందే జరిగాయని తెలిపారు. మోటూరి సత్యనారాయణ, ఆలూరి బైరాగి, ఆదేశ్వరరావు, ఇలపావులూరి పాండురంగారావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, అరికపూడి రమేశ్‌ చౌదరి వంటి అనేక మంది తెలుగు వారు హిందీ భాషకు చేసిన సేవను కృష్ణారావు ఈ సందర్భంగా వివరించారు.

Updated Date - Sep 26 , 2024 | 04:51 AM