ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Temperature: వడదెబ్బకు 14 మంది మృతి..

ABN, Publish Date - Jun 02 , 2024 | 03:38 AM

రాష్ట్రంలో ఎండలు తీవ్రత కొనసాగుతోంది. మూడ్రోజులుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. శనివారం ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 45.7, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 45.5,

  • రాష్ట్రవాప్తంగా భానుడి భగభగలు

  • 45 డిగ్రీలపైగానే ఉష్ణోగ్రతలు నమోదు

  • నేడు, రేపు వర్షాలు.. ఏపీలోకి ‘నైరుతి’!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో ఎండలు తీవ్రత కొనసాగుతోంది. మూడ్రోజులుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. శనివారం ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 45.7, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 45.5, అదే జిల్లా జైనా 45.3, మంచిర్యాల జిల్లా తపాల్‌పూర్‌, జన్నారంలో 45.1, జగిత్యాల జిల్లా అయిలాపూర్‌లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గజలాపురంలో వెంకట్‌రెడ్డి (55), అదే జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో చిన్న పిచ్చయ్య (38), ఖమ్మం జిల్లా మధిరలో కుంచెం నాగరాజు (49), అదే జిల్లా తల్లాడ మండలం మంగాపురంలో వెంకటేశ్వర్లు (63), దమ్మపేట మండలం కొమ్ముగూడెంలో రాముడు (56) ఎండలకు తాళలేక అస్వస్థతతో మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో అన్నవ్వ (86), పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గుర్తు తెలియని వ్యక్తి (35), మంచిర్యాల జిల్లా భీమారంలో ఇరికిల్ల సంపత్‌ (40), సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సంపత్‌ (42), హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ఐలయ్య (85), ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెంలో రాము (39), అదే జిల్లా వాజేడు మండలం చండ్రుపట్లకు చెందిన ఆర్‌ఎంపీ గొర్ల నర్సింహారావు (50), భూపాలపల్లి జిల్లా చిట్యాలలో రంగయ్య (52), జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఛాగల్‌లో లచ్చమ్మ (68) వడదెబ్బతో మరణించారు.


రెండ్రోజులు వర్షాలు..

రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులు పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 43 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాలు ఆదివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోని రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

Updated Date - Jun 02 , 2024 | 03:38 AM

Advertising
Advertising