Kartika Purnima: కోవెలలో కార్తీక దీప కాంతులు
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:30 AM
కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలు దీపాల కాంతుల్లో వెలిగిపోయాయి. మహిళలు భక్తి పారవశ్యంతో వెలిగించిన దివ్వెలతో కోవెలలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలు దీపాల కాంతుల్లో వెలిగిపోయాయి. మహిళలు భక్తి పారవశ్యంతో వెలిగించిన దివ్వెలతో కోవెలలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచే దైవ దర్శనాల కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. వేములవాడ, యాదగిరి గుట్ట, కీసర, ధర్మపురి, వేయి స్తంభాల ఆలయం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాల్లో సందడి నెలకొంది. కీసరగుట్ట ఆలయంలో వేకువ జామున 3 గంటలకే రామలింగేశ్వరుడికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ధర్మపురిలోని బ్రహ్మపుష్కరిణిలో పంచ సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదగిరి గుట్ట, గూడెం గుట్ట ఆలయాల్లో దంపతులు పెద్ద సంఖ్యలో వ్రత పూజలు చేశారు.
Updated Date - Nov 16 , 2024 | 05:30 AM