ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: సుచిత్రలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు..

ABN, Publish Date - May 19 , 2024 | 02:57 AM

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని 1.11 ఎకరాల భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిని.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సర్వేనంబరు 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాస్‌ రెడ్డి, మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలను వెంటబెట్టుకొని వచ్చారు.

  • 1.11 ఎకరాల భూమి వ్యవహారంలో గొడవ

  • వివాదాస్పద స్థలంపైకి కోర్టు పత్రాలతో 16 మంది..

  • షెడ్లు, సీసీ కెమెరాల తొలగింపు.. ప్రహరీలో కొంత ధ్వంసం

  • రాజశేఖర్‌రెడ్డి, కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి రాక

  • ఇరువర్గాల తోపులాట.. చేయిచేసుకున్న ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి

  • వివాదాస్పద స్థలం వద్దకు కోర్టు పత్రాలతో 16 మంది

  • షెడ్లు, సీసీ కెమెరాల తొలగింపు.. ప్రహరీలో కొంత ధ్వంసం

  • అప్పటికప్పుడు రేకులతో ప్రహరీ

  • అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, కొడుకు భద్రారెడ్డితో మల్లారెడ్డి రాక

  • ఇరువర్గాల మధ్య తోపులాట

  • కాంగ్రెస్‌ అండతోనే ఇదంతా: మల్లారెడ్డి

  • ఆ భూమి మాదే: బాధితులు

పేట్‌బషీరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని 1.11 ఎకరాల భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిని.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సర్వేనంబరు 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాస్‌ రెడ్డి, మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలను వెంటబెట్టుకొని వచ్చారు. అక్కడున్న ఆటో షెడ్లు, సీసీ కెమెరాలు తీసేశారు. ప్రహరీని ఓ వైపు కూల్చేశారు. 1.11ఎకరాల భూమి పరిధి మేరకు వారంతా రేకులతో ప్రహరీని ఏర్పాటు చేశారు. అందులో టెంట్‌ వేసుకొని కూర్చున్నారు. విషయం తెలిసి మల్లారెడ్డి, ఆయనఅల్లుడు రాజశేఖర్‌రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అనుచరులతో కలిసి స్ధలం వద్దకొచ్చారు. శ్రీనివా్‌సరెడ్డి ఇతర వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న రేకుల ప్రహరీ, టెంట్‌ను తన అనుచరులతో కలిసి కూల్చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాటలతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి అగ్రహంతో పలువురిపై చేయి చేసుకున్నారు. పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ రాములు ఆధ్వర్యంలో ఏడు పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు పెద్ద సంఖ్యలో ఘటనా స్ధలానికి చేరుకున్నారు.


మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఆయన అనుచర వర్గాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అండతోనే శ్రీనివా్‌సరెడ్డి తన అనుచరవర్గంతో వచ్చి ప్రహరీని కూల్చి, షెడ్లను నేల మట్టం చేశారని మల్లారెడ్డి మండిపడ్డారు. తాము సుచిత్రలోని సర్వే నంబరు 82,83ల్లో అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి 2.20 ఎకరాలను దూల్‌చంద్‌ సిల్క్‌ పరిశ్రమ యాజమాన్యం నుంచి కొన్నామని చెప్పారు. ఈ స్థలం కోసం ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ 8నెలల క్రితం తమ వద్దకు వచ్చారని, తమకు సంబంధించిన వారి భూమి మీ అధీనంలో ఉందని చెప్పారని పేర్కొన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు తాము భూమి మీదికి పోతే అప్పట్లో మంత్రిగా మల్లారెడ్డి బెదిరించారని, ఇప్పుడు కూడా మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిసి తన అనుచరులతో వచ్చి దాడి చేశారని శ్రీనివా్‌సరెడ్డి, ఆయన వర్గీయులు ఆరోపించారు. సర్వే నంబర్‌ 82లో పట్టదారుగా ఉన్న సుదమా వద్ద తాము 1.11 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, ఆ భూమిని 15మందిమి 400గజాల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసుకొని 2016 వరకు పొజిషన్‌లో ఉన్నామని తెలిపారు.


తాము సేల్‌డీడ్‌ చేసుకున్నామని, ఏడీ సర్వే, రెవెన్యూ సర్వే చేసి మల్లారెడ్డికి 1.29 గుంటలు ఉందని హద్దులను కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. మా హద్దులో మేము బ్లూషీట్స్‌ను ఏర్పాటు చేసుకున్నామని, వాటిని తొలగించారని చెప్పారు. సీఎం, పోలీసులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు కోర్టు అను కూలంగా తీర్పు ఇచ్చిందంటూ కాగితాలను మీడియాకు చూపించారు. కాగా మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి ఆయన వర్గీయులపై కేసు నమోదు చేశామని, ఇరువర్గాలను అదుపులోకి తీసుకొన్నామని, అంతా స్టేషన్‌లోనే ఉన్నారని ఏసీపీ రాములు తెలిపారు. కుత్బుల్లాపూర్‌ మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోందని, నివేదిక వచ్చాక ఉన్నతాధికారులకు, పోలీసులకు అందజేస్తామని కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ చెప్పారు.

Updated Date - May 19 , 2024 | 02:58 AM

Advertising
Advertising