ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GHMC: లిడ్‌ క్యాప్‌ స్థలంలో ఇళ్ల కూల్చివేత

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:21 AM

తెలంగాణ లెదర్‌ ఇండస్ర్టీస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(లిడ్‌ క్యాప్‌)కు చెందిన స్థలంలో ఇళ్ల కూల్చివేతలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

  • సమాచారం ఇవ్వలేదంటూ అడ్డుకున్న బాధితులు

  • రాయదుర్గం పరిధిలోని మల్కం చెరువు వద్ద ఉద్రిక్తత

  • ఇది యూనిటీ మాల్‌కు ఇచ్చిన స్థలం: లిడ్‌ క్యాప్‌ ఎండీ

రాయదుర్గం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లెదర్‌ ఇండస్ర్టీస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(లిడ్‌ క్యాప్‌)కు చెందిన స్థలంలో ఇళ్ల కూల్చివేతలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. రాయదుర్గం పరిధిలోని మల్కం చెరువు వద్ద 42 ఎకరాలను సుమారు 50 ఏళ్ల క్రితం లిడ్‌క్యాప్‌ సంస్థకు కేటాయించారు. అదే సంస్థకు సర్వే నంబర్లు 1, 3, 4, 9లోనూ 5.16 ఎకరాల భూమి ఉంది. అయితే, ఈ భూమిలో 40 ఏళ్లుగా పలువురు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు.


సోమవారం ఉదయం భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, టీజీటీపీసీ విభాగం అధికారులు సంయుక్తంగా ఇక్కడ కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో నివాసగృహాలను కూల్చివేసి తమను రోడ్డుపాలు చేయొద్దని పలువురు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివాసముంటున్నామని, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సామగ్రి బయట పడేసి, ఇళ్లు కూల్చి వేయడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ స్థలంపై కోర్టులో స్టే ఉందని చెప్పినప్పటికీ వినకుండా అన్యాయంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు పూర్తి చేశారు. కాగా, సర్వే నంబర్‌ 1,3,4,9లో ఉన్న 5.10 ఎకరాల భూమిని ప్రభుత్వం యూనిటీ మాల్‌ కేటాయించిందని లిడ్‌క్యాప్‌ ఎండీ శ్రీనివా్‌సనాయక్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న యూనిటీ మాల్‌లో రాష్ట్రంలో తయారయ్యే అన్ని రకాల ఉత్పత్తులను విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

Updated Date - Aug 27 , 2024 | 03:21 AM

Advertising
Advertising
<