TET 2024: నేటి నుంచి టెట్ దరఖాస్తులు
ABN, Publish Date - Nov 05 , 2024 | 04:34 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. మంగళవారం (5వ తేదీ) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు
జనవరి 1 నుంచి పరీక్షల నిర్వహణ
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. మంగళవారం (5వ తేదీ) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాదికి రెండుసార్లు టెట్‌ను నిర్వహిస్తామని ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి టెట్‌ను నిర్వహించగా.. రెండో టెట్‌కు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం టెట్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలను వచ్చే జనవరి 1 నుంచి 20 వరకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. టెట్ నోటిఫికేషన్‌కు సంబంఽధించిన పూర్తి వివరాలను మంగళవారం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు విద్యాశాఖ అఽధికారులు ప్రకటించారు. జ్ట్టిఞట://టఛిజిౌౌజ్ఛూఛీఠ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ. జౌఠి.జీుఽ అనే వెబ్‌సైట్‌లో అభ్యర్థులు టెట్ నోటి ఫికేషన్ వివరాలను పరిశీలించవచ్చు.
టెట్‌లో అర్హత సాధించిన
అభ్యర్థుల వివరాలు (శాతాల్లో)..
ఏడాది పేపర్-1 పేపర్-2
2011 44.20 49.68
2012 44.43 47.02
2014 61.86 28.56
2016 54.45 25.04
2017 57.37 19.51
2022 32.68 49.64
2023 36.89 15.30
2024 67.12 34.18
Updated Date - Nov 05 , 2024 | 04:34 AM