ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: వానాకాలం పంటతో రైతులకు రూ.40 వేల కోట్లు

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:22 AM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కింద ఎక్కువ వరి పండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేపదే చెప్పేదని, ఈ వానాకాలం కాళేశ్వరం లేకుండానే ఏ రాష్ట్రంలో పండనంత వరి తెలంగాణలో పండిందని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు.

  • వరిలో ఉమ్మడి రాష్ట్రం రికార్డులు

  • చెరిపేశాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

  • ఆయిల్‌పామ్‌తో ఎకరాకు 2లక్షలు: తుమ్మల

మహబూబ్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కింద ఎక్కువ వరి పండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేపదే చెప్పేదని, ఈ వానాకాలం కాళేశ్వరం లేకుండానే ఏ రాష్ట్రంలో పండనంత వరి తెలంగాణలో పండిందని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. వానాకాలం 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని, ఉమ్మడి రాష్ట్ర రికార్డులను కూడా తెలంగాణ చెరిపేసిందని చెప్పారు. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులదేనన్నారు. పండిన పంటకు మద్దతుతో పాటు సన్నధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తున్నామని వెల్లడించారు. వానాకాలం పంట ద్వారా తె లంగాణ రైతాంగం రూ.40 వేల కోట్లు ఆర్జించారని చెప్పారు. కల్లాలలో మిగిలిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.


మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రైతు పండగ రెండో రోజు కార్యక్రమంలో శుక్రవారం ఉత్తమ్‌, తుమ్మల పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్ళను పరిశీలించారు. అనంతరం మంత్రులిద్దరూ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం రైతు పక్షపాతిగా పని చేస్తుందని ఉత్తమ్‌ చెప్పారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులు ఆయిల్‌ఫామ్‌ సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పంటతో ఎకరాకు రూ.2 లక్షలు ఆదాయం వస్తుందన్నారు. మహబూబ్‌నగర్‌లో రెండు పామాయిల్‌ మిల్లులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పండిన పంటను రైతుల ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. వలసల జిల్లాగా పేరుపడిన మహబూబ్‌నగర్‌ జిల్లాను పెట్టుబడులు పెట్టే జిల్లాగా మారుస్తామని ప్రకటించారు.

Updated Date - Nov 30 , 2024 | 03:22 AM