ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AI Policy: అందరికీ ఏఐ!

ABN, Publish Date - Sep 06 , 2024 | 03:46 AM

విద్యార్థులు.. ఉద్యోగులు.. వృద్ధులు.. ఇలా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడిపై కృత్రిమ మేధ తన ప్రభావం చూపించబోతోంది.. వీరందరికీ ఏఐలో కనీస ప్రాథమిక శిక్షణ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏఐ విధానాన్ని ప్రకటించింది.

  • మూడేళ్లలో కోటి మందికి కృత్రిమ మేధపై అవగాహన

  • వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యార్థులకు పాఠాలు

  • 5 లక్షల మందికి ఉద్యోగాలశిక్షణ.. ఉపకార వేతనాలూ..

  • ప్రభుత్వ సేవల్లో వినియోగం.. ఉత్పాదకత 20ు పెంపు

  • ఏఐకి సలహా మండలి.. నేరుగా సీఎం ఆఫీసుకే రిపోర్టు

  • 20 వేల ప్రభుత్వ టీచర్లకు ఏఐ సాంకేతికతలో శిక్షణ

  • రోడ్‌ మ్యాప్‌ విడుదల చేసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు.. ఉద్యోగులు.. వృద్ధులు.. ఇలా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడిపై కృత్రిమ మేధ తన ప్రభావం చూపించబోతోంది.. వీరందరికీ ఏఐలో కనీస ప్రాథమిక శిక్షణ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏఐ విధానాన్ని ప్రకటించింది. కృత్రిమ మేధ అంతర్జాతీయ సదస్సులో వచ్చే మూడేళ్లకు సంబంధించిన ఏఐ మార్గదర్శ ప్రణాళికను(రోడ్‌ మ్యాప్‌) విడుదల చేసింది. 2027 నాటికి ఈ రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రభుత్వ పాలన, పౌర సేవలు, టెక్నాలజీ వినియోగంలో సింగపూర్‌, మలేషియాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసిన ప్రభుత్వం రాష్ట్ర అవసరాలు, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది. వచ్చే మూడేళ్లలో కోటి మంది జనాభాకి ఏఐ ఆధారిత పౌర సేవలు అందించడం, వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల్లో 20 ఉత్పాదకత పెంచడం రోడ్‌ మ్యాప్‌లో కీలకాంశాలు.


  • బడుల్లో ఏఐ పాఠాలు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలల్లో ఏఐ పాఠాలు ఉంటాయి. ఈ మేరకు పాఠ్యాంశాల్లో మార్పు చేస్తారు. 15-18 వయస్సుగల ప్రతీ విద్యార్థికి ఏఐపై పూర్తి అవగాహన కల్పించడం దీని లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 20 వేల ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ అందిస్తారు. 5 లక్షల విద్యార్థులకు ఏఐపై పూర్తి అవగాహన కల్పిస్తారు. 2027 నాటికి అన్ని పాఠశాలలకు చెందిన మొత్తం విద్యార్థులకు ఏఐ పాఠ్యాంశాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఈ రంగంపై ఆసక్తిని పెంచేందుకు పాఠశాలల్లో ఏఐ టూల్స్‌, సాఫ్ట్‌వేర్‌పైనా ప్రాథమిక శిక్షణ ఉంటుంది. ఏఐ విషయంపై పరీక్షలు, ప్రాజెక్టు రిపోర్టులు ఉంటాయి. ఇంటర్‌ స్థాయిలో ఏఐ పాఠ్యాంశాలు పారిశ్రామిక అవసరాలు, ఉపాధి కల్పనకు అనుగుణంగా రూపొందిస్తారు.


  • అందరికీ ఏఐ

స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్‌నెట్‌ పరిజ్ఞానంపై ఏ మాత్రం అవగాహన లేని వారికి కూడా కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం సులభంగా అర్ధమయ్యేలా అందరికీ ఏఐ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో 15-60 మధ్య వయస్కుల వారికిఏఐ ప్రాథమిక శిక్షణ ఉంటుంది. దైనందిక జీవితంలో, ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. మూడేళ్లలోనే ఈ వయసు వారందరికీ ఏఐపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.


  • తెలుగులో ఏఐ

తెలంగాణ అవసరాలు, సేవలకు తగినట్టుగా కృత్రిమ మేధ విధానాలు, పరికరాలను రూపొందించడంపై దృష్టి సారిస్తారు. దీనికోసం తెలంగాణ సలహా మండలి, పరిశోధనా కేంద్రాల ఏర్పాటు చేస్తారు. స్థానిక పరిస్థితులకు తగినట్టుగా వ్యవసాయం, ఆర్థిక, సేవా రంగాల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఏఐ సలహాలు తెలుగులో అందిస్తారు.


  • ఏఐ సిటీ

కొత్త సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ అందిపుచ్చుకోవడం, విస్తరించడం, అమలు చేయడానికి సిద్ధంగా ఉండేలా ఏఐ సిటీని ఏర్పాటు చేస్తారు. ప్రపంచానికే గ్లోబల్‌ హబ్‌గా ఇది సేవలందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లోనూ ఏఐ సేవలను ప్రవేశపెట్టేందుకు ఇది ఒక కేంద్రంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ఏఐ కంపెనీలు ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు కూడా ఉంటాయి. కోవర్కింగ్‌ స్పేస్‌, కన్వెన్షన్‌ సెంటర్లు, సహకార జోన్లు, స్కిల్‌ యునివర్సిటీ, బిగ్‌ డేటా సెంటర్స్‌ ఏఐ సిటీలో భాగంగా ఉంటాయి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేయబోయే ఏఐ నోడ్స్‌ను ఏఐ సిటీకి అనుసంధానిస్తారు.


  • ఏఐ కళాక్షేత్ర

ఏఐ సిటీలో ‘సెంటర్‌ ఫర్‌ ది ఫ్యూచర్‌’ ఏర్పాటు చేస్తారు. నిజజీవిత సేవలను అనుసంధానించే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఏఐ కళాక్షేత్ర కూడా ఇందులో ఉంటుంది. కళలు, సాంస్కృతిక అంశాలకు సంబంధించి సృజనాత్మకతతో కూడిన సరికొత్త సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తారు.


  • ఏఐ నోడల్‌ ఆఫీసర్‌

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏఐని విస్తృతంగా వినియోగించడం, పౌరులకు సంబంధించి సేకరించిన వ్యక్తిగత సమాచార భద్రత, శాఖ పరిధిలో పౌర సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు ప్రతీ ప్రభుత్వ శాఖలో ఏఐ నోడల్‌ ఆఫీసర్‌ నియామకం.


ఏఐ ఆధారిత కార్యక్రమాలు

  • పౌరసేవలు - కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్‌గా టీ-యాప్‌. లక్ష్యం: 80 లక్షల మంది.

  • రోగ నిర్ధారణ- అత్యధిక ముప్పు(హైరిస్క్‌) ఉన్న రోగుల గుర్తింపు. వారి ఆరోగ్య పరిరక్షణకు సమయానుకూల సూచనలు, ప్రభుత్వ సహకారం. లక్ష్యం: 70 లక్షలు.

  • ప్రాథమిక విద్య- ప్రాథమిక విద్యలో వెనకబడిన విద్యార్థులను ఏఐ మొబైల్‌ యాప్‌ ద్వారా గుర్తించడం. లక్ష్యం: 12 లక్షలు.

  • ట్రాఫిక్‌ - రియల్‌ టైం డేటాతో ట్రాఫిక్‌ నిర్వహణ. లక్ష్యం: 40 లక్షలు

  • టెలీ మెడిసిన్‌ - ఏఐ రహిత టెక్నాలజీతో టెలీ మెడిసిన్‌ సేవలు. లక్ష్యం: 21 లక్షలు

  • ఇంటర్‌ విద్య - జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల్లో వెనకబడిన ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. లక్ష్యం: 8 లక్షలు

  • వ్యవసాయం: భూసార పరీక్షల ఆధారంగా వేయదగ్గ పంటలకు సంబంధించి రైతులకు సూచనలు. లక్ష్యం: 30 లక్షలు.

  • ముందస్తు నివారణ: అంటువ్యాదులు, ఇతర రోగాలు ప్రబలే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు. ముందస్తు నియంత్రణ చర్యలు. లక్ష్యం: 10 లక్షలు.

Updated Date - Sep 06 , 2024 | 03:46 AM

Advertising
Advertising