ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: ఢిల్లీకి సీఎం రేవంత్..

ABN, Publish Date - Nov 11 , 2024 | 09:07 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్ల పర్యటన ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు.

TG CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఏఐసీసీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ వివరించనున్నట్లు సమాచారం.

Also Read: ఏపీకి భారీగా పెట్టుబడులు.. యూత్‌కు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్


మరోవైపు సీఎం రేవంత్ మళ్లీ హస్తినకు పయనం కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్.. రాష్ట్ర పార్టీ నేతల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరుపున బరిలో దిగేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆయా ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read: AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్


అలాగే మంత్రి వర్గ విస్తరణ అంశం గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ అంశంపై కూడా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశముందని తెలుస్తుంది. రేవంత్ కేబినెట్‌లోకి తీసుకోవాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ పెద్దల చేతికి అందినట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీలో పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లనున్నారని తెలుస్తుంది. రెండు రోజుల పాటు ఆయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.

Also Read: ఆర్కే రోజాకు మంత్రి సవిత చురకలు


మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) శివసేన (ఉద్దవ్ ఠాక్రే) పార్టీల భాగస్వామ్య పక్షాల కూటమి మహా వికాస్ అఘాడీ ఎలాగ అయినా అధికారాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కానీ వరుసగా రెండో సారి తమ అధికారాన్ని నిలుపుకోవాలని ఎన్సీపీ ( అజిత్ పవార్), శివసేన (షిండే), బీజేపీ కృత నిశ్చయంతో ఉన్నాయి. అందులోభాగంగా ఇప్పటికే ఈ కూటములు మేనిఫెస్టోలను సైతం విడుదల చేశాయి.

Also Read: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం
Also Read: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ


అలాగే తమ తమ ప్రచార పర్వాన్ని సైతం ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు, పార్టీ అధ్యక్షులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులు, అగ్రనేతలను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటరు ఎవరి పట్టం కట్టాడన్నది తెలియాలంటే మాత్రం నవంబర్ 23వ తేదీ వరకు ఆగాల్సిందేనన్నది సుస్పష్టం. ఎందుకంటే.. అ రోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి.

Also Read: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..

For Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 09:12 PM