ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీజీవో విస్తృత స్థాయి కార్యవర్గం ఎన్నిక

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:44 AM

ఉద్యోగులకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) కేంద్ర కార్యవర్గంలో మరో 33 మందిని ఎన్నుకుంది.

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) కేంద్ర కార్యవర్గంలో మరో 33 మందిని ఎన్నుకుంది. అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాస్‌ రావు, ఉపాధ్యక్షులుగా జగన్మోహన్‌రావు, ఎస్‌.సహదేవ్‌, ఎం.రామకృష్ణ గౌడ్‌, దీపారెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడిగా బాగారి శ్యామ్‌, ప్రధానకార్యదర్శిగా ఏనుగుల సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యవర్గం ఎన్నిక అనంతరం నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శనివారం అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీజీవో అధ్యక్షుడు ఏలూరి మాట్లాడుతూ, ఉద్యమాల రూపకల్పన, ఉద్యోగులకు సేవలు చేసే విషయంలో టీజీవో పాత్ర ఎనలేనిదని అన్నారు.


సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాపాలన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఉద్యోగుల మౌలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం పెండింగ్‌ బిల్లులు యద్ధ ప్రాతిపదికన క్లియర్‌ చేయాలని, నాలుగు డీఏలు ఇవ్వాలని, అరోగ్య రక్షణ పథకం అమలు, వేతన సవరణ కమిటీ నివేదిక, స్థానికత ప్రాతిపదికన 317 జీవో అమలు, అన్ని శాఖల్లో పదోన్నతుల కమిటీల ఏర్పాటు, ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి వారి సొంత ప్రాంతాలకు బదిలీ చేయడం వంటి 8 తీర్మానాలను ప్రతిపాదించారు.

Updated Date - Dec 22 , 2024 | 03:44 AM